మీకు దగ్గరలో ఏటిఎంలు లేవా? మీరు డబ్బులు తీసుకోవటానికి చాలా దూరం వెళ్ళవలసి వస్తోందా? అయితే మీకో శుభవార్త. ఇప్పుడు ఈ ఇబ్బందులకు చెక్ పెట్టటానికి పోస్ట్ ఆఫీసే ఏటిఎంగా మారనుంది.
Friday, November 28, 2014
Friday, October 17, 2014
దీపావళి చిట్కా చెప్పండి - బహుమతులు గెలవండి
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే, ఆ నెలంతా దాదాపు పండుగ వాతావరణమే. దసరా, బతుకమ్మ పండుగలతో మొదలు పెట్టి, దీపావళి వరకు దాదాపు 15 రోజులకు పైగా సంబరాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు దీపావళి దగ్గరకు వచ్చేసింది. ఇండియాలో చాలామంది దీపావళిని ఐదురోజులు జరుపుకుంటారు. ఇది ధన త్రయోదశితో మొదలై, భగినీ హస్తభోజనంతో ముగుస్తుంది.
Tuesday, September 23, 2014
విజయవాడలో భగ్గుమంటున్న భూముల ధరలు
ఏపిలో రాజధాని విషయం పూర్తిగా నిర్ణయం జరగకముందే విజయవాడలో ఆకాశానికి చేరుకున్న భూముల ధరలు, రాజధాని విజయవాడే అనగానే చుక్కలని తాకటం మొదలు పెట్టాయి. కేవలం విజయవాడలోనే కాకుండా, విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెటూళ్ళలో కూడా గజం మూడు, నాలుగు వేలకు తక్కువ లేదు. ఇక విజయవాడకు 30, 40 కిలోమీటర్ల దూరం ఉంటే రేటు ఆరేడువేల పైమాటే.
Saturday, September 20, 2014
వర్క్ ఫ్రం హోం నిజంగా వర్కవుతుందా
ఈరోజుల్లో చాలామంది ఇంటి నుండి పని చేయటానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఇంధనం ధరలు, ట్రాఫిక్ చిక్కులు, పిల్లలను లేదా ఇంట్లో పెద్దవాళ్ళను లేక ఇతరత్రా పనులు చూసుకోవడానికి ఎవరూ లేకపోవటం, ఆఫీసులో పొద్దుటినుండి సాయత్రం వరకు పని చేసినా పెద్దగా పెరగని జీతాలు, లభించని ప్రమోషన్లు, ఒకే రకమైన పని చేయటంతో విసుగు, ఇంకా ఇతర కారణాల వల్ల చాలామంది వర్క్ ఫ్రం హోం ను ఎంపిక చేసుకుంటున్నారు.
Thursday, September 18, 2014
వెసిల్ - పానీయాల్లోని పోషక విలువలను గుర్తించే స్మార్ట్ కప్
వెసిల్ కప్ మనం తీసుకునే పానీయాల్లోని పోషక విలువలను గుర్తిస్తుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ కప్. దాంట్లో పోసిన పానీయం ఏమిటో, దానిలో ఏమేమి పోషక విలువలున్నాయో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరు దాంట్లో ఎంత పానీయం పోశారో, ఎంత తాగారో, ఇంకా ఎంత మిగిలి ఉందో ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది.
Wednesday, September 17, 2014
అసహ్యం కలిగిస్తున్న అసభ్య టివి ప్రోగ్రామ్స్
టివి ఛానెల్స్ లో ఈమధ్య వస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జెమినీ ఛానెల్లో వస్తున్న అంతఃపురం గురించి. దీని ద్వారా వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఈప్రోగ్రాం గురించి చాలా మంది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా తిడుతూ రాయటం నేను ఎన్నో మ్యాగజైన్స్ లోనూ, అంతర్జాలంలోనూ చదివాను.
Tuesday, September 16, 2014
ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు
ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు పెరిగిన పిల్లల్ని మీరుప్పుడైనా చూశారా? మీరట్ లోని కరణ్ సింగ్ ఐదేళ్ళకే ఐదడుగుల పైన ఎత్తు పెరిగాడు. కొద్ది రోజుల్లో అతనికి ఆరేళ్ళు నిండబోతున్నాయి. ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుతో అతను గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.
Subscribe to:
Posts (Atom)