Saturday, September 19, 2015

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3 త్వరలో ప్రారంభమవబోతోంది. దీని కోసం వచ్చే శనివారం నుండి అంటే సెప్టెంబర్ 26, 2015 నుండి అక్టోబర్ 2 వరకు మొత్తం 7 ప్రశ్నలుంటాయి.

ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ప్రశ్న అడిగితే, దానికి జవాబుగా ఎస్ఎంఎస్ పంపించటానికి 23 గంటల 30 నిముషాల సమయం ఉంటుంది. అంటే మర్నాడు సాయంత్రం 6:30 లోపల పంపించాలి. అయితే దీన్లో పాల్గొనాలంటే సీజన్1 లేక సీజన్ 2 లో ఆడిషన్ రౌండ్స్ లో పాల్గొని ఉండకూడదు. అంతే కాకుండా సెప్టెంబర్ 25 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి.
మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3
ఎస్ఎంఎస్ పంపించేటప్పుడు సెప్టెంబర్ 25, 2015 నాటికి నిండిన ఏళ్ళు మాత్రమే నమోదు చేయాలి. ఉదాహరణకు సెప్టెంబర్ 25 నాటికి 22 ఏళ్ళ 11 నెలలు ఉంటే 22 ఏళ్ళు అని నమోదు చేయాలి.

వచ్చిన మొత్తం ఎస్ఎంఎస్ లలో నుండి 22,000 సరి అయిన ఎంట్రీలను జనరల్ రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు. వాటిలో నుండి దాదాపు 2760 సరి అయిన ఎంట్రీలను సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు సెలెక్ట్ చేస్తారు.  ఆడిషన్ రౌండ్ కి ఎంపిక చేయటానికి, వాటికి కాల్ చేస్తారు. అలా కాల్ చేసిన కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, కాల్ ఆన్సర్ చేసిన వ్యక్తిని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంకి నమోదు చేసిన వ్యక్తి మీరేనా అని అడిగి వారి వివరాలు తెలుసుకుంటారు. వివరాలు సరిగా చెప్పకపోతే పోటీలో పాల్గొనటానికి అర్హులు కారు. కనుక ఒకే ఫోన్ నుండి ఇద్దరు, ముగ్గురు నమోదు చేసుకోవటం మంచిది కాదు. 

అంతేకాకుండా, మీరు కనుక ఇంతకు ముందు  సీజన్1 లేక సీజన్ 2 లోని ఆడిషన్ రౌండ్స్ లో పాల్గొని ఉంటే మీరు ఇక్కడతో ఆగిపోవలసిందే. మీరు ఇంకా ముందున్న రౌండ్స్లోకి వెళ్ళటానికి అర్హులు కారు, కనుక మీరు ఇంతకు ముందు సీజన్1 లేక సీజన్ 2 లోని ఆడిషన్ రౌండ్స్ లో పాల్గొని ఉంటే ఎస్ఎంఎస్ పంపించినా కూడా వృథాయే. 

ఇక కాల్స్ చేసిన తర్వాత, వాటిలో నుండి 2300 సరి అయిన ఎంట్రీలను లేక వ్యక్తులను ఆడిషన్ రౌండ్ కి ఎంపిక చేస్తారు. ఆడిషన్స్ అక్టోబర్ 9, 2015 నుండి అక్టోబర్ 18, 2015 వరకు జరుగుతాయి. ఆడిషన్ రౌండ్ లో హైదరాబాద్లోని వారికి 25 శాతం, మిగిలిన తెలంగాణలోని వారికి 25 శాతం, విజయవాడ, వైజాగ్లోని వారికి 20 శాతం, మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లోని వారికి 25 శాతం, ఇంకా మిగిలిన 5 శాతం మొత్తం ఇండియాలోని తెలుగువారికోసం కేటాయించారు. 

అంటే మొత్తం 2300 మందిలో 50 శాతం తెలంగాణలోని వారికి అయితే, అందులో సగం హైదరాబాద్లోని వారికి, మిగిలిన సగం తెలంగాణలోని ఇతర జిల్లాల వారికి; మిగిలిన 50 శాతంలో 45శాతం ఆంధ్ర ప్రదేశ్ లోని వారికి, మిగిలిన 5 శాతం ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారికోసం కేటాయించారు.

ఆడిషన్స్ అక్టోబర్ 9, 10 తేదీల్లో వైజాగ్లో, అక్టోబర్ 13, 14 తేదీల్లో నెల్లూరులో, అక్టోబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతాయి. వైజాగ్, నెల్లూరులలో జరిగే ఆడిషన్స్ కి ఇంకా వెన్యూ నిర్ణయించలేదు.  హైదరాబాద్లో మాత్రం బంజారాహిల్స్, రోడ్ నెంబరు 2 లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతాయి. 

మీరు కూడా ఈ ప్రోగ్రాం లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి.

No comments:

Post a Comment