రాజకీయ నాయకులని వెక్కిరించటం, సైబర్ నేరాలు పెరుగుతున్నదరిమిలా, భారత ప్రభుత్వం ఫేస్ బుక్ ని నిషేధించనుంది. ఈ విషయంలో భారతదేశం చైనాని అనుసరించబోతోంది. వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 6 నుండి ఈ నిషేధం అమలులోకి రానుంది.
ఫేస్ బుక్ ని నిషేధించనున్న భారత ప్రభుత్వం |
"ఫేస్ బుక్ వల్ల భారత దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే ఫేస్ బుక్ ని నిషేధించటం ఒక్కటే మార్గం." అని భారత ఐటి మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఈ నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతించింది. ఫేస్ బుక్ వల్ల యువత హద్దు మీరుతున్నారని, ఈ నిషేధం వాళ్ళని బాధ్యత కలిగిన పౌరులుగా చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ తొగాడియా అన్నారు.
భారత సైబర్ సెన్సార్ యూనిట్ (సిసియుఐ) కు ఫేస్ బుక్ ని నిషేధించే అధికారాన్నికేంద్ర ప్రభుత్వం అప్పగించింది. "ఈ నిషేధం తప్పక యువతలో నైతిక విలువలని పెంచుతుంది. మన సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది" అని సిసియుఐ డైరెక్టర్ శ్రీ రవి సంస్కార్ అన్నారు.
ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం భారత యువతకి కోపం తెప్పించింది. ఇది తమ వాక్స్వాతంత్ర్యాన్ని, హక్కులని కాలరాయటమేనని వారు మండిపడ్డారు. అనేక చోట్ల ధర్నాలు నిర్వహించారు. అనేకమంది తమ పొట్టల మీద నీలి రంగుతో బొటనవేలు ఉన్న ఫేస్ బుక్ సింబల్ వేసుకుని తమ నిరసనని తెలియచేశారు.
ఈరోజు ఏప్రిల్ 1. పైన రాసినదంతా నిజం కాదు. సరదా కోసమేనని మనవి. ఇంకా ఇలాంటివి చదవాలంటే సందర్శించండి.
No comments:
Post a Comment