Friday, November 28, 2014

ఇక పోస్ట్ ఆఫీసే ఏటిఎం

మీకు దగ్గరలో ఏటిఎంలు లేవా? మీరు డబ్బులు తీసుకోవటానికి చాలా దూరం వెళ్ళవలసి వస్తోందా? అయితే మీకో శుభవార్త. ఇప్పుడు ఈ ఇబ్బందులకు చెక్ పెట్టటానికి పోస్ట్ ఆఫీసే ఏటిఎంగా మారనుంది. 

హైదరాబాద్లో ఏటిఎంలు తక్కువగా లేక ఉన్నచోట ఇబ్బందులని దూరం చేయటానికి, వచ్చే జనవరి నుండి 300 కంప్యూటరీకరణ చేసిన పోస్ట్ ఆఫీసులు ఏటిఎంగా మారబోతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ గా ఇవి మొదలవ్వబోతున్నాయి కనుక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఖాతాదారులకి మాత్రమే వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. 

ఇక పోస్ట్ ఆఫీసే ఏటిఎం
ఇమేజ్


ఇవి ఎలా పని చేస్తాయంటే పోస్ట్ ఆఫీసులో పెట్టిన మెషీన్లో  ఏటిఎం కార్డుని స్వైప్  చేస్తే ఒక రసీదు వస్తుంది. దాన్ని కౌంటర్లో చూపిస్తే డబ్బులు ఇస్తారు. ఖాతాదారు తీసుకున్న మొత్తానికి తన ఖాతాలో నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అయితే గరిష్టంగా 1000 రూపాయల వరకు మాత్రమే దీని ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఈ స్కీం విజయవంతం అయితే గరిష్టంగా ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని, అలాగే ఇతర బ్యాంకుల ఖాతాదారులకికూడా ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ బి వి సుధాకర్ చెప్పారు. 

ఇంకా  ఆసక్తి కలవారికి పోస్ట్ ఆఫీసు ఫ్రాంచైజీ ఔట్లెట్ తీసుకోవటానికి అవకాశం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ ఔట్లెట్లో పోస్టల్ స్టాంపులు, కార్డులు, కవర్లు, ఇన్లాండ్ లెటర్స్ అమ్మవచ్చు. దీనికోసం నిర్ణయించిన మొత్తాన్ని పోస్ట్ ఆఫీసు వారికి సెక్యూరిటీ డిపాజిట్ గా కట్టాలి. అమ్మిన వాటన్నింటి మీదా 5% కమీషన్ ఇస్తారు.

No comments:

Post a Comment