Friday, October 17, 2014

దీపావళి చిట్కా చెప్పండి - బహుమతులు గెలవండి

ఆశ్వయుజ మాసం వచ్చిందంటే, ఆ నెలంతా దాదాపు పండుగ వాతావరణమే. దసరా, బతుకమ్మ పండుగలతో మొదలు పెట్టి, దీపావళి వరకు దాదాపు 15 రోజులకు పైగా సంబరాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. దసరా పండుగ అయిపోయింది.  ఇప్పుడు దీపావళి దగ్గరకు వచ్చేసింది. ఇండియాలో చాలామంది  దీపావళిని ఐదురోజులు జరుపుకుంటారు. ఇది ధన త్రయోదశితో మొదలై, భగినీ హస్తభోజనంతో ముగుస్తుంది. 


దీపావళి చిట్కా చెప్పండి - బహుమతులు గెలవండి 

దీపావళి అంటేనే పిల్లలకు ఎంత ఉత్సాహమో. వాళ్ళకు ఇష్టమైన బాణాసంచా కాల్చటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ఈ మధ్య కాలంలో కొంతమంది యువత వాతావరణ కాలుష్యమని, శబ్ద కాలుష్యమని బాణాసంచా కాల్చటానికి ఇష్టపడటం లేదు. అయితే చాలామంది మాత్రం దీపావళి అంటేనే బాణాసంచా కాల్చాలని, లేకపోతే సరదా ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది విపరీతమైన శబ్దాలు కలిగించేవాటిని అర్ధరాత్రి పూట కాలుస్తూ, చుట్టుపక్కల వారికి చికాకు కలిగిస్తారు. ఒకరి సరదాలు వేరొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే బాగుంటుంది. అప్పుడే పండుగ ఆనందం అందరూ పొందగలుగుతారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఈ సంబరాలను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 

దీపావళి చిట్కా చెప్పండి - బహుమతులు గెలవండి
  • సాధ్యమైనంత వరకు శబ్దకాలుష్యం కలిగించే వాటికి దూరంగా ఉంటే మంచిది. 
  • బాణాసంచా కాల్చటం అంటే ఒకరకంగా డబ్బులు వృధా చేయటమే. చిన్నపిల్లలకు ఈవిషయం అర్ధం కాదు కాబట్టి వారి సరదాలు కాదనకుండా, తక్కువ డబ్బులతో, ఎక్కువ ప్రమాదం లేని వాటిని కొని, కాల్పించాలి. 
  • బాణాసంచా కాల్చేటప్పుడు వదులైన నూలు దుస్తులు ధరించాలి. 
  • కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. చెవుల్లో దూదులు లేక ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే మంచిది.
  • ఖాళీ స్థలాలలో మాత్రమే టపాకాయలను కాల్చాలి. వాటిని కొవ్వొత్తులకు, ఇంకా ఇతర మంటలకు దూరంగా, మూత పెట్టి అట్టపెట్టెల్లో ఉంచాలి. 
  • దగ్గరలో బక్కెట్లో నీళ్ళు ఉంచుకుంటే, అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చు.
  • కాల్చిన టపాకాయలు పూర్తిగా ఆరిపోయిన తరవాత మాత్రమే వాటిని పక్కకు పెట్టాలి. చివర్లో అన్నింటినీ తీసుకుని చెత్తబుట్టలో పారేయడం మర్చిపోవద్దు. 
  • ఒకసారి వెలిగించిన వాటిమీదకు వంగి చూడకూడదు. అది చాలా ప్రమాదం.   
దీపావళి చిట్కా చెప్పండి - బహుమతులు గెలవండి


మీ దగ్గర కూడా ఇలాంటి చిట్కాలు ఉంటే పంచుకోండి. ఆసక్తికరమైన బహుమతులు, గిఫ్ట్ వోచర్లు పొందండి. మీరు ఏవైనా ఫోటోలు కానీ, మీకిష్టమైన జ్ఞాపకాలు కానీ, రుచికరమైన వంటకాలు కానీ ఏవైనా  పంచుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోండి.

2 comments:

  1. Meeru cheppina chivari chitka.......prathi deepaavalikee gurthu chesukuntam.
    1984 lo deepaavali 5 rojulu mundu maa thandrigaaru poyaaru.
    pillalu inka chinna vaallu.....tapakayala saradaa maamule.
    hadavudilo tapakayalu teledu nenu.
    Maa friends moulasahib gari kutumbam maa pillalni teesuku vellaaru tapakayalu kaalpinchadaniki. Chivarlo ....baaga mandu koorina oka chichubuddi sariga velagaledu. Maa chinnavaadu daani meediki vangi choosthunnaadu.venaki ninchi basha pattukune vunnaadu vaadini.
    suddenga chichubuddi veligindi. Basha veedini venakki laagaka pothe 2 kallu uu..poyeve. appati maavaadu ippudu doctor. Kalla doctor avvanu antaadu....45 vayasunna baashaa ippatikee veediki deepavali jagrathalu chepthuu vuntaadu....america lo.

    ReplyDelete
    Replies
    1. Thanks for sharing your experience jvrao garu. It is nice to hear that your son became a doctor. You can share your experience on the link I have given in the article to win exclusive Diwali gifts.

      Delete