కొన్నిసార్లు మన కలల్లో తినుబండారాలు కనిపిస్తాయి. వీటిలో కొన్నిటికి అర్దాలేమిటో ఇప్పుడు చూద్దాం.
కలలో అరటిపండు కనిపిస్తే అది తీరని శృంగార వాంఛలకు గుర్తు. కలలో అరటిపండు తింటున్నట్లు కనిపిస్తే అది మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందబోతున్నారని అర్ధం.
బ్రెడ్
బ్రెడ్ జీవిత కనీస అవసరాలకు గుర్తు. జీవితమనే ప్రయాణంలో మనం నేర్చుకున్న గొప్ప విషయాలను, జీవితం పట్ల మనకున్న సానుకూల దృక్పధాన్ని ఇది తెలియచేస్తుంది.
క్యాబేజ్
క్యాబేజ్ తోట కలలో కనిపిస్తే స్థిరాస్తుల కొనుగోళ్ళ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది స్థిరాస్తుల కొనుగోళ్ళలో నష్టాన్ని తెలియచేస్తుంది. క్యాబేజ్ వండుతున్నట్లుగా కల వస్తే అది దంతవ్యాధులకు గుర్తు. క్యాబేజ్ తింటున్నట్లుగా కల వస్తే అది కుటుంబ సభ్యులతో రాబోతున్న వివాదాన్ని సూచిస్తుంది.
క్యారట్ మరియు చెర్రీ
కలలో క్యారట్ కనిపిస్తే అది సమృద్ధికి సూచన. చెర్రీ పండు నిజాయితీని, అదృష్టాన్ని సూచిస్తుంది.
కొబ్బరి బొండాం
కొబ్బరి బొండాం అనుకోని ధన లాభాన్ని సూచిస్తుంది.
నిమ్మకాయలు
నిమ్మకాయలు కలలో కనిపిస్తే మనం ఏదైనా అనుకున్న దానికన్నా తక్కువది పొందబోతున్నామని అర్ధం. నిమ్మకాయ తింటున్నట్లు లేక పీలుస్తున్నట్లు వస్తే అనారోగ్యానికి సూచన. ఎండిన నిమ్మకాయ జీవిత భాగస్వామితో విభేదాలను, విడిపోవడాన్నిసూచిస్తుంది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు కలలో కనిపిస్తే కోర్టుకేసులు, వివాదాలను తెలియచేస్తుంది. పుట్టగొడుగులు తింటున్నట్లుగా కనిపిస్తే ప్రేమలో దారుణంగా విఫలమవటాన్ని సూచిస్తుంది.
నారింజ, కమలా పండ్లు
కలలో నారింజ లేక కమలాపండ్ల చెట్లు కనిపిస్తే ఆరోగ్యం, అభివృద్ధికి గుర్తు. తింటున్నట్లుగా కనిపిస్తే బిజినెస్ లో అసంతృప్తి, కుటుంబ సభ్యుల అనారోగ్యం, ప్రేమికులతో విడిపోవడం మొదలైన వాటికి సూచన.
పిజ్జా తింటున్నట్లుగా కల వస్తే అది సంతృప్తికి సూచన కావచ్చు. లేదా ఏదైనా కొరతగా ఉందని భావించినప్పుడు కూడా ఇలాంటి కల రావచ్చు.
ఆపిల్
ఆపిల్ కలలో కనిపిస్తే అది జ్ఞానానికి, అభివృద్ధికి సూచన. భవిష్యత్తులో గొప్ప బహుమతులు పొందబోవటాన్ని ఇది సూచిస్తుంది. ఆపిల్ తింటున్నట్లుగా కల వస్తే అది సంతాన సాఫల్యతకు, సంతోషానికి గుర్తు.
No comments:
Post a Comment