Friday, October 28, 2011

ప్రపంచ జనాభాలో మీరు ఎన్నవవారు

మీరెప్పుడైనా ప్రపంచ జనాభాలో ఎన్నవవారు అని తెలుసుకోవాలనుకున్నారా? అయితే పాపులేషన్ యాక్షన్ అనే వెబ్ సైట్ కు వెళ్ళండి. 

అక్కడ మీరు పుట్టిన తేదీ, సంవత్సరం చెప్పిన చోట ఎంటర్ చేయండి. ప్రపంచ జనాభాలో మీరు ఎన్నవవారో వందల కోట్లలో చూపించబడుతుంది. పాపులేషన్ యాక్షన్ ప్రకారం ఈ నెల 31 వ తేదీ నాడు ప్రపంచ జనాభా  700 కోట్లు దాటుతుంది.

 ఇమేజ్ 
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు రెండు లక్షల మంది పుడుతున్నారు. జనాభా ఇదే విధంగా  పెరిగితే 20 ఏళ్లలో 900 కోట్లు దాటి 2050 కల్లా 1100 కోట్లకు చేరుతుందని అంచనా. దీనికి ముఖ్యమైన కారణం సరి ఐన కుటుంబ నియంత్రణ పద్దతులు లేకపోవటమే. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఆడవారు సరి ఐన కుటుంబ నియంత్రణ పద్దతులు లేకపోవటం వలన గర్భం ధరిస్తున్నారు. 

ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే ప్రపంచ జనాభాలోసగం మంది 25 ఏళ్ల లోపు వారే. దానివల్ల సంతానోత్పత్తి శక్తి ఎక్కువగా ఉండి జనాభా పెరుగుదలకు కారణమవుతోంది. జనాభా పెరుగుదలను అరికట్టకపోతే ప్రపంచ దేశాలన్నింటికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం మరియు ప్రజలు సమిష్టిగా జనాభా పెరుగుదల సమస్యను అరికట్టటానికి కృషి చేయాలి.

4 comments:

  1. మీ పోస్టులు అన్నీ బాగుంటున్నాయి
    చాలా సంతోషం.నాబ్లాగు పేరు కూడా
    "దర్పణం" ఒక వేళ మీరు నాకంటే ముందే
    ఈ పేరుతొ బ్లాగును ప్రారంభించి ఉంటే
    తెలుపగలరు.నాబ్లాగు పేరు మార్చుకుంటాను
    నేను 2007 లో ఇది స్టార్ట్ చేసాను
    ఇది నా మెయిల్ ఎడ్రస్;
    essemCHELLURU@gmail.com

    ReplyDelete
  2. సారీ మూర్తిగారు, నేను మీకంటే చాలా ముందునుండి బ్లాగర్ లో మెంబర్ని. ఆ విషయం ప్రొఫైల్ ద్వారా తెలుసుకోవచ్చు. దర్పణం బ్లాగ్ ను అప్పుడే ప్రారంభించాను. కాకపోతే చాలా కాలం పాటు ఏమీ రాయలేదు.

    ReplyDelete
  3. మీ పోస్ట్ లు చాలా బాగున్నాయి

    ReplyDelete