Wednesday, October 26, 2011

రొమ్ము కాన్సర్ కు ముఖ్యమైన ఐదు కారణాలు

ప్రపంచమంతా అక్టోబర్ నెలను రొమ్ము కాన్సర్ అవగాహనామాసంగా పాటిస్తారు. ఈ సందర్భంగా రొమ్ము కాన్సర్ కు కారణమయ్యే ముఖ్యమైన కొన్నింటి గురించి చూద్దాం. 

మొక్కలకు వాడే పురుగుమందులు ఎన్నో వ్యాధులకు కారణమని మనకు తెలిసిందే. వీటిలో రొమ్ము కాన్సర్ కూడా ఒకటి. సాధారణంగా ఈ పురుగుమందులు నాడీవ్యవస్థ మీద పని చేస్తాయి. ఆ రకంగా ఇవి రొమ్ము కాన్సర్ కు కారణమవుతాయి.


అలాగే మనం ఇల్లు శుభ్రం చేయడానికి వాడే చాలా పదార్ధాలు ఆల్కైల్ ఫినాల్స్ వంటి రసాయనాలు కలిగిఉంటాయి. ఇవి రొమ్ము కాన్సర్ కు కారణమవటం మాత్రమే కాక మెదడు మీద, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతాయి. 

చాలా రకాల  పాలీకార్బనేటేడ్ ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు ఆహారపదార్థాలు, నీరు నిల్వ చేయటానికి వాడతారు. ఈ సీసాలు, డబ్బాలలో బిపిఎ అనే హాని కారక రసాయనం ఉంటుంది. ఇది చాలా రకాల అనారోగ్యాలకు ప్రత్యేకించి రొమ్ము కాన్సర్ కు కారణమవుతుంది.

వంటకు కాడ్మియం, అల్యూమినియం వంటివి కాకుండా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు వాడాలి. అల్యూమినియం ప్రత్యక్షంగా డిఎన్ ఎ ను నాశనం చేస్తుందని ఎన్నో పరిశోధనలలో రుజువైంది.  అలాగే ప్రాధమిక పరిశోధనలలో రొమ్ము కాన్సర్ కు అల్యూమినియంకు సంబంధం ఉందని తేలింది. అయితే ఇంకా పరిశోధనలు జరగవలసి ఉంది. 

సోయా ఉత్పత్తులు శరీరానికి మంచిదని అందరికి తెలిసిందే. అయితే పురుగుల మందులు వాడకుండా సహజ ఎరువులు వాడి పెంచిన సోయా చిక్కుళ్ళు, సోయా పిండి, తోఫు వంటివి మాత్రమే ఆరోగ్యానికి మంచిది.  కానీ కృత్రిమంగా దొరికే సోయా ఉత్పత్తులు (సోయా ప్రోటీన్, సోయా బిళ్ళలు) వంటివాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే వీటివల్ల  రొమ్ము కాన్సర్ ప్రమాదం పొంచిఉంది.

No comments:

Post a Comment