Wednesday, March 7, 2012

హోలీ యొక్క విశిష్టత

హోలీ ఆడటం అనేది చాలా పురాతన కాలం నుండి అంటే ఇంచుమించు 7 వ శతాబ్దం నుండే ఉంది. దీనికి ఉదాహరణగా రత్నావళి అనే సంస్కృత నాటకంలో వెదురు సిరంజిలతోటి రంగు నీళ్ళు చల్లుకున్నట్లుగా చెప్పబడింది.

హోలీ గురించి వేర్వేరు కథనాలు పురాణాలలో ప్రస్తావించడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ, మన పెద్దవాళ్ళు ఏర్పర్చిన అనేక ఆచారాల లాగే హోలీ ఆడటం వెనుక మన ఆరోగ్యానికి సంబంధించిన విశిష్టత ఉంది.

ఇమేజ్ 

చలికాలం వెళ్లి, ఎండాకాలం మొదలు కాబోతున్న సమయంలో హోలీ జరుపుకుంటాము. వాతావరణంలోని మార్పుల వలన మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండటానికి   పసుపు, కుంకుమ, మారేడు, వేప మొదలైన వాటితో హోలీ ఆడాలని మన పెద్దలు సూచించారు. ఒకప్పుడు అలానే ఆడేవారు. అయితే రాను, రానూ సహజసిద్ధమైన రంగులు పోయి కృత్రిమ రంగులు వచ్చాయి. వాటి వల్ల మనకే కాక పర్యావరణానికి కూడా ఎంతో నష్టం కలిగేది. ఇప్పుడిప్పుడు ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగి కృత్రిమ రంగులు వాడటం కంటే అసలు హోలీకే దూరంగా ఉండటం మంచిదని అనుకుంటున్నారు. చాలా మంది ఖరీదు ఎక్కువైనా సహజసిద్ధమైన రంగులతోటే హోలీ ఆడుతున్నారు. కనుక మీరు కూడా అలాంటి రంగులతోటే హోలీ ఆడి ఆరోగ్యాన్ని పెంచుకోండి.
 
హోలీ శుభాకాంక్షలు. 

No comments:

Post a Comment