Thursday, March 22, 2012

ఉందా మంచి కాలం ముందు ముందునా

ముందుగా అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒకప్పుడు కనీసం భవిష్యత్తు మంచిగా ఉంటుందని ఆశ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఎక్కడా అలాంటి అవకాశం కనిపించటం లేదు. పంచాంగశ్రవణం కూడా ఆశాజనకంగా లేదు.

ఇమేజ్ 

దొంగతనాలు, స్త్రీల మీద అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, విడాకులు పెరుగుతాయని, వర్షాలు సమృద్ధిగా ఉండవని, బంగారం, వెండి, వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, భూకంపాలు, అగ్నిప్రమాదాలు ఎక్కువవుతాయని కొంతమంది పండితులు ఈ సంవత్సర ఫలితాలలో ప్రస్తావించారు.

జ్యోతిష్యం సంగతి పక్కన పెడితే అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం పుస్తకాలలోనూ, ప్రభుత్వ లెక్కల్లోనూ తప్ప నిజంగా కట్టడి అవటం లేదు.  కేంద్ర ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం పేదరికం బాగా తగ్గిపోయింది ఎందుకంటే రోజుకు 28 రూపాయల 65 పైసలు కంటే ఖర్చు పెట్టే ప్రతి వ్యక్తీ పేదవాడు కాదు. ఈసంవత్సరం బడ్జెట్ ప్రకారం చాలా వస్తువుల, సేవల ధరలు పెరగనునున్నాయి. మార్చ్ 31 నుండి విద్యుత్ చార్జీలు పెరగబోతున్నాయని ఒక సమాచారం.  రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేటి మీద వడ్డించబోతోందో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఉందా మంచి కాలం ముందు ముందునా అని అనిపిస్తోంది.

No comments:

Post a Comment