మీరు పుస్తకాలను తినగలరా? పుస్తకాలను తినటం ఏమిటి, చదువుతారు కానీ అని అనుకుంటున్నారా? అయితే మీరు ఎడిబుల్ బుక్ ఫెస్టివల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
Thursday, March 31, 2011
Tuesday, March 29, 2011
ఆడ, మగ వాళ్ళలో ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు
మీరెప్పుడైనా "ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు? ఆడవారా లేక మగవారా?" అని ఆలోచించారా? తమ సగటు అరవై ఏళ్ల జీవితంలో మగవారు కనీసం లక్షసార్లు, ఆడవారు యాభైవేలసార్లు అబద్ధాలు ఆడతారు.
Monday, March 28, 2011
గర్భిణీ స్త్రీల యొక్క ఐరన్ లోపం పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది
గర్భిణీ స్త్రీలు వారి మొదటి మూడు నెలలలో ఐరన్ లోపాన్ని కలిగి ఉంటే వారి బిడ్డల మెదడు ఎదుగుదల సరిగా ఉండదు. ఈ ఐరన్ లోపం రక్తహీనతను కలిగించేటంత ఎక్కువగా ఉండక పోయినా కూడా ఇది వారికి పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.
చక్కెర వ్యాధిగ్రస్తులకు తీపివార్త
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28.5 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 5 కోట్లమంది భారతీయులే.
కావలసిన వస్తువులను 75 % దాకా తగ్గింపులో పొందండి
మీకు కావలసిన ఏ వస్తువైనా 75 % దాకా తగ్గింపులో పొందే అవకాశం ఉందని మీకు తెలుసా?
Saturday, March 26, 2011
ఎర్త్ అవర్ గుర్తుందా
ఎర్త్ అవర్ గుర్తుందా? అది ఈ రోజే. రాత్రి పూట 8.30 నుండి 9.30 వరకు. ఎర్త్ అవర్ మొదటిసారిగా 2007 లో సిడ్నీలో జరిగింది. 22 లక్షలమంది సిడ్నీ ప్రజలు అనవసరమైన లైట్లు అన్నింటిని ఆపివేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని 2008 వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎర్త్ అవర్ ఉద్యమంలో పాల్గొన్నాయి.
Friday, March 25, 2011
వింత పెన్నులు
పెన్నులు రాయడానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వింత పెన్నులు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
Wednesday, March 23, 2011
ఆనందానికి అయిదు ఆహార పదార్ధాలు
మనం తీసుకొనే ఆహారం మన మూడ్ ని మార్చగలదని ఎన్నో పరిశోధనలలో రుజువైంది. కొన్ని ఆహార పదార్ధాలు మన ఆనందాన్ని పెంచుతాయి. ఈసారి మీ మూడ్ బాగాలేనప్పుడు క్రింద చెప్పిన ఆహార పదార్ధాలు తీసుకొని చూడండి.
ఈ అయిదు ఆహార పదార్ధాలు మీ ఆనందాన్ని పెంచుతాయి.
పదోతరగతి పిల్లలకు చిట్కాలు
రేపటినుండి పదోతరగతి పిల్లలకు పరీక్షలు. పిల్లలకు పరీక్షలంటే తల్లితండ్రులకు పరీక్షలే.ఎక్కువ వత్తిడి లేకుండా పిల్లలకు మంచి మార్కులు రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అవేంటంటే
Tuesday, March 22, 2011
ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా
ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మార్చ్ ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణంలో జరిగే మార్పుల పట్ల ప్రజలలో అవగాహన కలిగించడమే. ఈ నెల అంటే మార్చ్ 26వ తారీఖు రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు ఎర్త్ అవర్ జరుగుతుంది.
Thursday, March 17, 2011
ఈ హోలీకి ఆర్గానిక్ రంగులు వాడండి
హోలీ వస్తోంది కదా! రంగులతో జాగ్రత్త. ఆర్గానిక్ రంగులు వాడండి. ఆర్గానిక్ రంగులంటే సహజంగా పసుపు, హెన్నా, బీట్రూట్, బంతిపువ్వు వంటివాటితో తయారయినవి. ఇవి చర్మానికి కానీ, కళ్ళకు కానీ ఎలాంటి హాని చేయవు.
Subscribe to:
Posts (Atom)