ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28.5 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 5 కోట్లమంది భారతీయులే.
ఇంతకాలం రక్తంలో చక్కెర శాతం కనుక్కోవాలంటే సూది ఉపయోగించవలసి వచ్చేది. అది ఎంతో కొంత నెప్పిని కలిగించేదే. ముఖ్యంగా దీర్ఘకాల రోగులకు ఇది చాలా ఇబ్బందిని కలిగించేది. కాని ఇకముందు ఆ బాధ ఉండదు.
ఆరిజోనా స్టేట్ యూనివర్సిటి రిసెర్చ్ టీం తయారుచేసే కొత్త పరికరం కన్నీరు సహాయంతో రక్తంలోని చక్కెర శాతాన్ని సరిగ్గా చూపిస్తుంది. నెప్పి లేకుండా చక్కెర శాతాన్ని కనుక్కొనే ఈ కొత్త పరికరం చక్కెర వ్యాధిగ్రస్తులకు ఆశాకిరణమని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇది మార్కెట్లోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.
No comments:
Post a Comment