Thursday, March 31, 2011

మీరు పుస్తకాలను తినగలరా

మీరు పుస్తకాలను తినగలరా? పుస్తకాలను తినటం ఏమిటి, చదువుతారు కానీ అని అనుకుంటున్నారా? అయితే మీరు ఎడిబుల్ బుక్ ఫెస్టివల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. 


ఏప్రిల్ 1 న ప్రపంచ వ్యాప్తంగా ఆల్ ఫూల్స్ డే జరుపుకుంటారని తెలిసిందే కదా! కానీ ఏప్రిల్ 1 న జరిగే ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. వాటిలో ఎడిబుల్ బుక్ ఫెస్టివల్ ఒకటి.   ఫ్రెంచ్ లాయర్, రాజకీయనాయకుడు అయిన జీన్ (జాన్) యంతల్మే బ్రిలాట్-సావరిన్ గుర్తుగా దీనిని 2000 వ సంవత్సరం నుండి  ఆయన పుట్టినరోజు నాడు ( ఏప్రిల్1) ప్రపంచ వ్యాప్తంగా  జరుపుకుంటున్నారు.



ఈ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తినే పదార్ధాలతో పుస్తకాల రూపంలో ఉన్న వాటిని తయారు చేసి, వాటిని ఫోటో తీసి  బుక్స్ 2 ఈట్  కు పంపాలి. ఆ తర్వాత వాటిని తినేయవచ్చు. 






దీనిలో పాల్గొనాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి.  
  • అన్ని కార్యక్రమాలు ఏప్రిల్ 1 లేక దానికి దగ్గరలో జరగాలి.
  • తినే పదార్ధాలు తప్పక పుస్తక రూపంలోనే ఉండాలి.
  • పాల్గొనే వారందరూ తప్పక బుక్స్ 2 ఈట్ తో రిజిస్టర్ చేసుకోవాలి. 





 వివిధ దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఈ సంవత్సరం కెనడా, యు.ఎస్. ఎ., ఫ్రాన్స్, వేల్స్, స్వీడెన్ పాల్గొంటున్నాయి. కాలిఫోర్నియా, స్వీడెన్ లలో రిజిస్టర్ చేసుకోవటానికి సమయం అయిపోయింది. కానీ మిగిలిన దేశాలలో ఇంకా ఉంది.

No comments:

Post a Comment