Friday, April 1, 2011

జి మెయిల్ మోషన్: మీ కదలికలతో జి మెయిల్ కంట్రోల్ చేయండి

గూగుల్ క్రొత్త ఫీచర్  జి-మెయిల్ మోషన్. దీని ద్వారా మీరు మీ కదలికలతో జి-మెయిల్ కంట్రోల్ చేయవచ్చు. 
ఇప్పటిదాకా మనం మౌస్, కీబోర్డ్ లతో మన కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తున్నాం కదా! ఇప్పుడు  జి-మెయిల్ మోషన్ వెబ్ కాం ద్వారా మన కదలికలను కంప్యూటర్ కు కావలసిన కమాండ్స్ గా మార్చి జి-మెయిల్ ను కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. 
దీని ద్వారా ఫాస్ట్ గా, సులువుగా జి-మెయిల్ ను ఉపయోగించవచ్చు. చాలా బాగుంది కదా! ఇది నిజమైతే బాగుండేది. కాని ఏప్రిల్ 1 సందర్భంగా ఇది గూగుల్ తన యూజర్స్ మీద  ప్లే చేసిన ప్రాక్టికల్ జోక్.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 న గూగుల్ ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేస్తుంది. అలాగే ఈ ఏప్రిల్ 1 న ప్లే చేసిన కొన్ని జోక్స్ లో జి-మెయిల్ మోషన్, ఆటో కంప్లీటార్, క్రోమర్సైజ్ మొదలైనవి ఉన్నాయి.
క్రోమర్సైజ్ యూజర్స్ చేతుల బలాన్ని, సామర్ధ్యాన్ని పెంచుతుంది. దాని వల్ల బ్రౌజింగ్ ఫాస్ట్ గా చేయవచ్చు.

No comments:

Post a Comment