Friday, April 15, 2011

జెట్ ప్యాక్ తో నీళ్ళమీద సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపొండి

మానవుడు రాకెట్స్ లోనూ,  నౌకలలోనూ ప్రయాణిస్తున్నాడు. అయినా ఇంకా ఏదో సాధించాలనే తపన కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. సినిమాలో సూపర్ మ్యాన్ లాగా, జేమ్స్ బాండ్ లాగా గాలిలో ఎగిరిపోతే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు అది విజయవంతమయింది.
ఇమేజ్ 
కెనడా ఇంజనీర్ రేమండ్ లీ తయారుచేసిన జెట్ ప్యాక్  జెట్ లెవ్ ఫ్లయర్ సహాయంతో నీళ్ళమీద 30 అడుగుల ఎత్తులో గంటకు 35 మైళ్ళ వేగంతో గాలిలో ప్రయాణించవచ్చు. దీనికోసం అతడు పది ఏళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరికరం ఫ్లోరిడాలోని మయామి బీచ్ లో విజయవంతంగా ప్రయోగించబడి ఈ మధ్య ఇంటర్నేషనల్ బోట్ షోలో ప్రదర్శించబడింది.




ఆశ్చర్యకరమైన విషయమేంటంటే   ఇది నీళ్ళ సహాయంతో నడుస్తుంది. దీని ఖరీదు అక్షరాలా $179,155.90 మాత్రమే.

No comments:

Post a Comment