Tuesday, April 5, 2011

మల్లె పూలతో టీ - ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఇది మల్లె పూల సీజన్ కదా! కనుక మల్లెపూలతో టీ ఎలా చేయాలో, దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.

మల్లెపూల వాడకం మనకు కొత్తదేమీ కాదు. అయినప్పటికీ పూలను టీలో వాడడం మన దేశంలో అరుదు. మల్లెపూల టీ చైనాలో, జపాన్లో చాలా పాపులర్. ఈ టీ యొక్క ఉపయోగాల మీద చాలా రిసర్చ్ చేసి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని తేల్చారు పరిశోధకులు. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఈ టీ ప్రాచుర్యం పొందుతోంది.  కనుక మనం కూడా ఇప్పడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.


మల్లెపూలతో టీ ఎలా చేయాలి:
ఈ టీని తయారుచేసే పద్ధతులు చాలా ఉన్నాయి. కాని అన్నిటికంటే సులభమైన మార్గం మనమిప్పుడు చెప్పుకుందాం. మల్లెపూల టీ కోసం మీరు తాజా మొగ్గలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టండి. దాంట్లో ఒక చెంచా మామూలు టీపొడి వేయండి. టీపొడి కన్నా మల్లెమొగ్గలు ఎక్కువగా ఉండాలి. ఒక చెంచా టీపొడికి ఏడు చెంచాల మల్లెమొగ్గలు తీసుకోవాలి. ఈ నిష్పత్తి కొంచెం అటూ, ఇటూ అయినా ఫర్వాలేదు. కాని టీపొడి, మల్లెమొగ్గల నిష్పత్తి 1 :7 ఉంటే ఆ మల్లెలలోని సుగుణాలు అన్నీ పొందవచ్చు. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళను మరగనివ్వండి. అవి బాగా మరిగినాక వాటిని గిన్నెలో పెట్టుకున్న మల్లెలు, టీ పొడి పెట్టిన గిన్నెలో పోసి కొంచెంసేపు మూత పెట్టండి. ఐదు నిముషాలు ఆగి దానిని వడకట్టి, దానిలో పటికబెల్లం పొడి కాని, తేనె కాని కలిపి త్రాగండి. 


మీరు టీపొడి తయారు చేసుకోలేకపోతే  హిందూస్తాన్ టీ కంపెనీ వద్ద నుండి కొని వాడుకోవచ్చు.
ఈ టీ వల్ల ఉపయోగాలు:


  • రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
  • రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అందుచేత హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని రానీయదు.
  • వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
  • లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది. తొందరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. 
  • దీనితో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. 
  • అల్సర్, కాన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. 
  • జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
  • వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు.
  • కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
  • రొమాంటిక్ భావాలు పెంచుతుంది. కనుక జడత్వం ఉన్నవాళ్ళకు చాలా మంచిది.

No comments:

Post a Comment