Friday, April 8, 2011

మీరెప్పుడైనా కూరగాయల మ్యూజియం గురించి విన్నారా

మీరెప్పుడైనా కూరగాయల  మ్యూజియం గురించి విన్నారా? బంగాళదుంపల సైనికులను, కూరగాయల మొనాలిసాను ఎప్పుడైనా చూశారా?   చైనాకు  చెందిన జు ద్యుయోకి కూరగాయలతో రకరకాల పెయింటింగులు తయారుచేయగలదు.  






జు ద్యుయోకి 2006 నుండి కూరగాయలతో రకరకాల పెయింటింగులు తయారు చేయటం మొదలు పెట్టింది. రకరకాల కూరగాయలను ఉపయోగించి రకరకాల రంగుల చిత్రాలు తయారు చేస్తుంది.  కూరగాయలను ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయటం ద్వారా కావలసిన రూపాన్ని తెప్పిస్తుంది.




చిత్రాలలో వెరైటీ కోసం ఈమె తాజా కూరగాయలు,  ఎండిపోయినవి, ఉడికించినవి, వేయించినవి ఇలా రకరకాలుగా వాడుతుంది. సొరకాయ, కాబేజీ, ఆలుగడ్డ, క్యారట్, ఆకుకూరలు, ఇలా ఒకటేమిటి అన్నీ ఈమె చేతిలో అందమైన కళాఖండాలు అవ్వవలసిందే. చూశారుగా! ఎంత అందంగా తయారుచేసిందో! 

2 comments:

  1. భలే బాగున్నాయి... తినేసేలా!

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు నా కృతజ్ఞతలు.

    ReplyDelete