కంటి తర్వాత మన జ్ఞానేంద్రియాలలో ముక్కుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏదైనా ఆహార పదార్ధాన్ని మొదట కంటితో చూసి దాని వాసన బాగుంటేనే వెంటనే తినాలనుకుంటాం. అంతేకాక ముక్కు మన శ్వాసక్రియకు కూడా ఉపయోగపడుతుంది. అలాంటి ముక్కు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కుక్కలు చిన్న వాసనను కూడా పసిగట్టకలవు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ముక్కు కూడా అంత షార్ప్ అవుతుంది.
ముక్కుకు సంబంధించినంత వరకు జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. గుమ్మడికాయ గింజలు, నువ్వులు, ఎండిన పుచ్చకాయ గింజలు, కోకోవా పొడి, డార్క్ చాక్ లేట్, బీఫ్, మటన్, కాలేయం, ఆల్చిప్పలు వంటివి తీసుకుంటే ఆఘ్రాణించే శక్తి పెరుగుతుంది.
దీర్ఘకాలం దుర్వాసనలు పీల్చడం ముక్కు యొక్క పనితీరును దెబ్బతీస్తుంది. కనుక వాటికి దూరంగా ఉండండి.
వేగంగా నడవడం, ప్రాణాయామం వంటివి చాలా మంచివి.
దీర్ఘకాలం పొగత్రాగటం ముక్కులోని అల్ఫాక్టరీ నరాలను దెబ్బ తీస్తుంది. అలాగే మద్యపానం ఆఘ్రాణించే శక్తిని నాశనం చేస్తుంది. కనుక ఈ రెండిటికీ దూరంగా ఉండటం మేలు.
గాలి మరియు వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
ముక్కు దిబ్బడ వేసినప్పుడు సెలైన్ స్ప్రే చక్కగా పనిచేస్తుంది. లేదా మంచి ఇన్ హేలర్ అయినా సరే.
జలుబుకు సంబంధించిన మందులు ఎక్కువ కాలం వాడకూడదు. దానికంటే చిట్కా వైద్యాలు మేలు.
డా.హర్చ్ సిద్దాంతం ప్రకారం ఏదైనా ఘాటైన వాసనను 3 నిముషాల పాటు రోజుకు ఐదారుసార్లు పీల్చితే 4 నెలల్లో ఆఘ్రాణించే శక్తి పెరుగుతుంది.
No comments:
Post a Comment