సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా! కళ్ళు మన జ్ఞానేంద్రియాలలో ఎంతో ముఖ్యమైనవి. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే ఎంతో కష్టం. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువకాలం కళ్ళకు ఎలాంటి సమస్యా లేకుండా చూసుకోవచ్చు. మంచి దృష్టి కూడా ఉంటుంది.
ఇమేజ్
కంటికి ఎ విటమిన్ మంచిదని తెలుసు కదా! క్యారట్, బొప్పాయి, మామిడిపండు వంటివి ఎక్కువగా తీసుకుంటే కళ్ళకు చాలా మంచిది.
పాలకూరలాంటి ఆకుకూరలు శుక్లాలు, వయసు ముదిరినప్పుడు వచ్చే ఏ ఇతర కంటి జబ్బులు రాకుండా కాపాడతాయి. పాలకూరను ఆలివ్ ఆయిల్ తో వండితే వాటి ప్రయోజనం రెట్టింపవుతుంది. కనుక వారానికి రెండుసార్లు ఇలా తినటానికి ప్రయత్నించండి.
నీలం నేరేడుపండులో ఉన్న ఆంథోసైనిన్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. కనుక వారానికి రెండుసార్లు పెరుగుతో పాటు ఈ పళ్ళను తీసుకోండి.
కంటిలోని తేమ కంటికి మంచిది. దీనికోసం అప్పుడప్పుడు కళ్ళను ఆర్పుతూ ఉండండి. నెలకోసారి అయినా ఉల్లిపాయలు తరిగితే అవి కన్నీళ్ళ ద్వారా మన కంటిలోని మలినాలను పోగొట్టి చక్కటి చూపుని ఉంచడంలో తోడ్పడుతాయి.
బయటకి వెళ్ళేటప్పుడు ఎండనుండి రక్షణ కోసం సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళండి.
ఎ. సి. లు కంటిని పోడిబార్చటమే కాక కార్నియా చుట్టూ తెల్లటి పొరను ఏర్పరుస్తాయి. కనుక అవసరమైనప్పుడే వాడండి.
కంప్యూటర్ వాడేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్ వాడడం మర్చిపోవద్దు. ఎల్. సి.డి. లేక ఎల్.ఈ.డి. స్క్రీన్ ను వాడితే మంచిది. కంప్యూటర్ స్క్రీన్ ను కంటి కంటే కొంచెం క్రిందగా అమర్చుకోవాలి.
కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు కాని, పుస్తకం చదివేటప్పుడు కాని ప్రతి గంటకోసారి ఐదు నిముషాలు కంటికి విశ్రాంతినివ్వటం అవసరం.
ఇమేజ్ పిప్పరమింట్ ఆయిల్ లేక వెనిల్లా ముంజేతి మీద రాసుకొని వాసన చూడండి. ఇది మెదడును, తద్వారా కంటిలోని రాడ్స్ ను ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా కళ్ళు చక్కగా పనిచేస్తాయి.
ముక్కు చివర ఒక చిన్న చుక్క పెట్టి రెండుకళ్ళతో దానిని రెండు నిముషాలపాటు తదేకంగా చూడాలి. తర్వాత ఒక నిముషం పాటు కళ్ళు మూసుకోవాలి. తర్వాత మళ్లీ చూడాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే, కళ్ళ యొక్క, మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది.
No comments:
Post a Comment