చెవులు వినికిడికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడతాయి. చెవులు సక్రమంగా పనిచేయకపోతే ఏ శబ్దాన్నివినలేము. ముఖ్యంగా మనగురించి ఎవరైనా మాట్లాడే మంచి మాటలు (చెడ్డ మాటలు కూడా) వినలేము. కనుక అవి పనిచేస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు.
ఇమేజ్
మెగ్నీషియం లోపం ఉంటే వినికిడి శక్తిని త్వరగా కోల్పోతారని పరిశోధనలలో వెల్లడైంది. అరటిపండు, ఓట్స్, బీన్స్, సోయా బీన్స్, పాలకూర, బాదం, గోధుమలు, దంపుడు బియ్యం, శెనగలు, ఎండు అంజూరాలు, చేపలు వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి చెవిలోపలి ఎముకలను, రక్తనాళాలను, నాడులను కాపాడుతుంది. పైన చెప్పిన చాలా ఆహారపదార్ధాలలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది.
కెఫీన్ చెవులకు జరిగే రక్తసరఫరాలో అంతరాయం కలిగిస్తుంది. కనుక ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దు.
సోడియం ఎక్కువగా ఉన్న ఉప్పు వంటివాటితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవి చెవి లోపలి భాగంలో ద్రవాలను నిల్వ ఉంచడం ద్వారా వాపుకు కారణమై, చెవి పనితీరుని దెబ్బ తీస్తాయి.
స్నానం చేసేటప్పుడు నీరు చెవులలోకి పోకుండా జాగ్రత్తగా ఉండండి. చెవులలోకి పిన్స్ వంటి పదునైన వస్తువులు పెట్టవద్దు. చెవులు శుభ్రం చేయించుకోవాలనుకున్నప్పుడు ఇ.ఎన్.టి. డాక్టర్ దగ్గరకు వెళ్లి చేయించుకోవాలి.
ఇమేజ్
పరిమిత మోతాదులో బీర్ లేక వైన్ తీసుకుంటే చెవుల పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఇమేజ్
ధ్వని కాలుష్యానికి దూరంగా ఉండండి. బిగ్గరగా అరవటం లేదా మాట్లాడడం వోకల్ కార్డ్స్ ని, కాక్లియాలోని నరాలను దెబ్బ తీస్తుంది.
కాల్షియం, విటమిన్ డి చెవుల నరాలకు మేలు చేస్తాయని ప్రయోగాలలో రుజువైంది. కనుక పాలు, పెరుగు వంటివి తీసుకోవటం మర్చిపోవద్దు.
గాలిని బలంగా పీల్చి నోరు, ముక్కు మూసుకొని వదలటానికి ప్రయత్నిస్తే అది చెవులలోనుండి వస్తూ చెవులు బ్లాక్ అవ్వటాన్ని తొలగిస్తుంది. సూర్య నమస్కారాలు కూడా చెవులకు చాలా మంచివి.
No comments:
Post a Comment