గుండె అవయవాలు అన్నింటిలో ముఖ్యమైనదని తెలుసు కదా! శరీర భాగాలన్నింటికీ గుండె రక్తం సరఫరా చేస్తుంది. కనుక దాని ఆరోగ్యం పైనే మిగిలిన అవయవాల ఆరోగ్యం ఆధారపడిఉంది.
గుండె బలంగా ఉండాలంటే సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అందువల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెపోటు రాకుండా ఉంటుంది. ఒమేగా-3 -ఫ్యాటిఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది. ఈ క్రింద చెప్పబడిన చిట్కాలు గుండెను బలంగా ఉంచి గుండెపోటు మరి ఏ ఇతర గుండెజబ్బులు రాకుండా కాపాడతాయి.
- తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని రోజూ త్రాగితే గుండె జబ్బులు రావు.
- మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.
- రోజూ కాసిని ఎండు ద్రాక్ష తింటే గుండె బలంగా ఉంటుంది.
- ఎండు అంజూరపు పళ్ళను, జీలకర్రను సమ భాగాలుగా కలిపి పొడి చేసుకొని చెంచా తేనెలో కలిపి రోజూ తీసుకుంటే గుండెదడ, గుండెపోటు వంటివి రావు.
- అక్రూట్ కాయలు (వాల్ నట్స్) గుండెకు ఎంతో మంచివి.
- లేత చింతచిగురు గుండెకు చాలా మంచిది. దానిని కూరలలో వేసుకొని కానీ, పొడి చేసుకొని కానీ తినవచ్చు.
ఇమేజ్
- చిటికెడు కుంకుమపువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి పుచ్చుకుంటే గుండె బలంగా ఉంటుంది.
- దానిమ్మ గింజలు, దానిమ్మ ఆకుల రసం అన్ని రకాల గుండె జబ్బులను నివారిస్తుంది.
- చెంచా ఉసిరికాయ పొడిలో చెంచా తేనె కలిపి రోజూ తీసుకుంటే గుండెకు మంచిది.
- నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలను నేతిలో వేయించి రోజూ మధ్యాహ్నభోజనానికి ముందు తింటే గుండె బలంగా ఉంటుంది. ఇది వార్డక్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.
Useful information.
ReplyDelete