చాలామంది వ్రాసేటప్పుడు పెన్నుని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఇంకు నోట్లోకి పోతే చాలా ప్రమాదం కూడా. అయినా కూడా ఈ అలవాటును మానలేనివారు ఎంతోమంది ఉన్నారు. దీనిని చూసో ఏమో డచ్ డిజైనర్ డేవ్ హాకెన్స్ తినగలిగే పెన్నును తయారుచేసాడు.
సాధారణంగా మనం పెన్నును వాడిన తర్వాత పారేస్తాము. అలా పారేసే బదులు దానిని తింటే బాగుంటుంది కదా అనుకున్న డేవ్ ఈ పెన్నును తయారుచేసాడు.
దీంట్లో అరటిపండు, పుచ్చకాయ, పిప్పరమింట్ వంటి వివిధ రకాల క్యాండీ పీసెస్ ఉంటాయి. దీంట్లో ఉన్న ఇంకు కూడా తినగలిగేదే. రాయటానికి ఉపయోగించే ములుకు తప్ప దీంట్లో ఉన్నవన్నీ తినవచ్చు.
ఈ పెన్నే కాక డేవ్ ఇంకా అద్భుతమైన డిజైన్స్ చాలా తయారుచేసాడు. వాటిలో కొన్ని:
డస్ట్ బాల్
ఇది ఒక రోబోట్ వాక్యుం క్లీనర్. మార్కెట్స్ లో, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్నచోట్ల ఈ బాల్ ని నెట్టుకుంటూ లేక తన్నుకుంటూ పోతే మురికి మొత్తం పోయి ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. ఇది వైర్ లెస్ చార్జింగ్ ను ఉపయోగించుకుంటుంది.
బ్రేక్ సో ప్
బ్రేక్ సోప్ చిన్న చిన్న బ్లాక్స్ గా ఉంటుంది. ఒక పెద్ద బ్రేక్ సోప్ 90 సార్లు శుభ్రం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మొత్తం సబ్బు మురికి కాకుండా ఉంటుంది.
వెండి ఐస్ రాక్స్
వెండికున్న ఉష్ణగ్రాహక శక్తిని బట్టి, యాంటి బ్యాక్టిరియల్ గుణాలను బట్టి ఇతడు తయారుచేసిన వెండి ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లో పెట్టగానే గడ్డకడతాయి. వాటిని తీసి కావలసిన డ్రింక్ లేదా జ్యూస్ లో వేసుకుంటే అది ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. మామూలు ఐస్ క్యూబ్స్ లాగా డ్రింక్ ని నీళ్ళగా మార్చదు.
chaala baagunnayi.
ReplyDeleteThank you, Geetha.
ReplyDelete