చర్మం మన శరీరంలోని భాగాలన్నింటినీ ఎండ, వాన, చలి నుండి రక్షించడమే కాక వివిధ రోగాలబారిన పడకుండా కాపాడుతుంది. కనుక వ్యాధినిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
ఇమేజ్
చర్మానికి సంబంధించిన వ్యాధులు చాలా ఉన్నాయి. వాటన్నింటి గురించి మనం తర్వాత చూద్దాం. కానీ సాధారణంగా చర్మ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూద్దాం.
సూర్యుని యొక్క వేడి నుండి, అతినీలలోహిత కిరణాలనుండి మన చర్మాన్నిసంరక్షించుకోవటం కోసం ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించండి.
ఏరోబిక్ వ్యాయామం చెమట ద్వారా మన శరీరంలోని మలినాలను బయటకు విసర్జిస్తుంది. కనుక తగినంత వ్యాయామం ఉండేటట్లు చూసుకోండి.
సోయా బీన్స్ చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ను రక్షించి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నటువంటి ఆకుకూరలు, పండ్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. వార్ధక్యాన్నిదూరంగా ఉంచుతాయి.
మామూలు కణాల కన్నా వెల్లుల్లి రసంలో పెంచిన కణాలు ఏడు రెట్లు ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉన్నాయని అనేక పరిశోధనల్లో రుజువైంది. అంతే కాక వెల్లుల్లి రసం క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించగల్గినట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కనుక వెల్లుల్లిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
దర్బలు చర్మ గ్రంధులలోని నూనెను కాపాడుతాయి. పెప్పర్ మింట్, పుదీనా వంటివి చర్మాన్ని చల్లగా ఉంచుతాయి. పసుపు, ఆవాలు వంటివి చర్మం యొక్క బాహ్య పొరను రక్షిస్తాయి.
పొగ త్రాగటం, ఎండలో స్నానం చేయటం వంటి పనులు చర్మ ఆరోగ్యాన్ని నాశనం చేసి చర్మం ముడుతలు పడడానికి కారణమవుతాయి. కనుక అలాంటి వాటికి దూరంగా ఉండండి.
No comments:
Post a Comment