Friday, April 15, 2011

మానవ శరీరానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన నిజాలు

మానవ శరీరం ఎన్నో వింతలకు నిలయం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేషనల్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ మన శరీరం గురించి చెప్పిన  ఆశ్చర్యకరమైన  నిజాలలో కొన్ని:

ఇమేజ్
  1. మీకు తెలుసా? మనం  సాయంత్రంపూట కంటే ప్రొద్దునపూట ఒక సెంటిమీటర్ ఎక్కువ పొడుగు ఉంటామని. దీనికి కారణమేంటంటే మన ఎముకలలోని మృదులాస్థి సాయంత్రంపూట కుంచించుకుపోతుంది. 
  2. మన శరీరం అరగంటసేపు ఉత్పత్తి చేసే  ఉష్ణోగ్రతతో సుమారు రెండు లీటర్ల నీళ్ళను మరగపెట్టవచ్చు. 
  3. పగటిపూట మనం పని చేసేటప్పటి కంటే రాత్రి పూట మనం నిద్రించేటప్పుడు మన మెదడు ఎక్కువ చురుకుగా ఉంటుంది. 
  4. బాగా ఎక్కువగా తింటే వినికిడి శక్తి మందగిస్తుంది. 
  5. మన ఒక పాదంలో దాదాపు రెండున్నర లక్షల చెమటగ్రంధులు అంటే రెండు పాదాలలో కలిపి ఐదు లక్షలు ఉంటాయి. ఇవి రోజుకు తయారుచేసే చెమట దాదాపు అర లీటర్ ఉంటుంది. 
  6. మన మెదడు పనిచేయాలంటే  10 వాట్స్ శక్తి కావాలి. 
  7. ఎక్కువ ఐ.క్యు. ఉన్నవారికి ఎక్కువ కలలు వస్తాయి. కొంతమంది మెలకువగా ఉన్నప్పటికంటే కలలోనే ఎక్కువ తెలివిగా ఉంటారు. 
  8. అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే అడ్రినలిన్ వలన ఒక మనిషి కారు కూడా ఎత్తగలిగేటంత బలవంతుడవుతాడు. బాగా వత్తిడి, భయం, ఉత్తేజం, ఆందోళనవంటి వాటికి గురైనప్పుడు అడ్రినలిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 
  9. పుట్టినప్పుడు శిశువులు నీలిరంగు కళ్ళతో పుడతారు. తర్వాత మెలానిన్, అతి నీలలోహిత కిరణాలూ (అల్ట్రా వయొలెట్ రేస్) కంటి రంగును మారుస్తాయి. అంతేకాకుండా పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. పెద్దఅయిన తర్వాత 206 ఎముకలే ఉంటాయి. 
  10. మన పొట్టలోని ఆమ్లాలు రేజర్ బ్లేళ్ళను కూడా కరిగించుకోగలవు. 
  11. కుడి చేయి వాటం కలవారు ఎడమ చేయి వాడేవారి కంటే తొమ్మిదేళ్ళు ఎక్కువ బతికే అవకాశం ఉంది. 
  12. అండం మన శరీరంలోని అతి పెద్ద కణం. శుక్రకణం అతి చిన్నది. 
  13. మన మెదడులోని ఒక్కొక్క కణం దానిలో  ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదంటే దాదాపు వికీపీడియాలో ఉన్న సమాచారానికి ఐదు రెట్లు ఎక్కువ. 
  14. మనం పుట్టటానికంటే ఆరు నెలల ముందే మన పళ్ళు పెరగటం మొదలవుతుంది. 
  15. మన జీవిత కాలంలో మనం స్రవించే లాలాజలంతో దాదాపు రెండు స్విమ్మింగ్ పూల్స్ నింపవచ్చు.

No comments:

Post a Comment