Monday, April 25, 2011

నాలుక పట్ల శ్రద్ధ తీసుకోండిలా

నాలుక రుచిని తెలియచేయటమే కాక మన ఆరోగ్యాన్ని కూడా తెలియచేస్తుంది. మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు అయన మన నాలుక చూపించమనటం, దానిని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేయడం తెలిసిన విషయమే.

ఇమేజ్ 
నాలుక లేత ఎరుపు రంగులో ఉండాలి. ముదురు ఎరుపు రంగులో ఉంటే బాగా వేడికి లేక అల్సర్స్, వాపు వంటివాటికి సూచన కావచ్చు. తెల్లగా పాలిపోయినట్లు ఉన్న నాలుక రక్తహీనతకు లేక కొవ్వు, మ్యూకస్ వంటివి శరీరంలో నిల్వ ఉండడానికి సూచిక. పసుపు రంగులో ఉన్న నాలుక కాలేయం లేక పిత్తాశయంలోని సమస్యలకు చిహ్నం. ఊదారంగు నాలుక జీర్ణ సమస్యలను, వ్యాధినిరోధకశక్తిలేమిని, ఆకుపచ్చ లేక నీలం రంగు నాలుక రక్త ప్రసరణలోని లోపాలను సూచిస్తుంది. 

నాలుక వెనుక అంటే క్రింది భాగంలో పసుపు రంగుగా కనిపిస్తే అది పేగులు, గర్భాశయం లేక మూత్రనాళానికి సంబంధించిన ఇబ్బందులకు చిహ్నం. నాలుక వాపు ప్లీహంలో లోపాలకు, బాగా పలుచగా ఉండడం రక్తహీనతకు, పగుళ్ళు హృదయసంబంధ వ్యాధులకు సూచిక. ఒక రకంగా చెప్పాలంటే నాలుక మీద ఉన్న ఒక్కొక్క చిన్న భాగం ఒక్కొక్క అవయవాన్ని సూచిస్తాయి. కనుకనే వైద్యులు నాలుకను చూసి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. 

దీనిని బట్టి నాలుక (మనం తీసుకున్న ఆహారపదార్ధాల ద్వారా) ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అలాగే అనారోగ్యాన్ని తెలియచేయడానికి చాలా అవసరమైనదని తెలుస్తోందికదా! అటువంటి నాలుక పట్ల శ్రద్ధ తీసుకోండిలా: 

 
వాము, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, ఏలకులు వంటివి రుచిని పెంచుతాయి. కనుక వాటిని ఎక్కువగా తీసుకోవాలి. 
ఇమేజ్
నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే నోరు ఎండిపోకుండా, నాలుక యొక్క రుచి చూసే శక్తి తగ్గిపోకుండా ఉంటుంది. 
ఇమేజ్
నాలుక మీద రుచిని తెలిపే చిన్న చిన్న గ్రంధులు ఉంటాయి. ఆహారాన్ని బాగా నమిలి మింగితే అవి ఎక్కువ శక్తివంతంగా పని చేస్తాయి. 
ఇమేజ్
నాలుకను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముందే చెప్పుకున్నట్లుగా నాలుక మన ఆరోగ్యానికి సూచన కనుక నాలుక మీద ఏవైనా మచ్చల వంటివి కనిపించినా, నాలుక రంగు మారినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ కు చూపించుకోవాలి.
ఇమేజ్
బాగా వేడి పదార్ధాలు నాలుక మీద ఉన్న జిహ్వగ్రంధులను నాశనం చేస్తాయి. కనుక మరీ వేడిపదార్ధాలు తీసుకోవద్దు. 

రెండు, మూడు రోజులు లేక ఒక వారంపాటు ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించి తీసుకోండి. తర్వాత మామూలుగా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా చేయటం వల్ల నాలుక సమర్దవంతంగా పని చేస్తుంది.

No comments:

Post a Comment