Monday, April 18, 2011

మీ కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని తెలుసుకోండి

కొన్ని కలలు మనల్ని సంతోషపెడతాయి. కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. చాలాసార్లు మన కలల భావాలు మనం తెలుసుకోలేము. అయితే కలల మీద పరిశోధన చేసి విశ్లేషించిన కొంతమంది విశ్లేషకులు మన కలలో కనిపించిన రంగు లేక వస్తువును బట్టి అది దేనికి సూచనో తెలుసుకోవచ్చంటున్నారు. ఇప్పుడు మన కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని, దాని సూచనలను తెలుసుకుందాం.
గ్రే
ఇమేజ్
గ్రే భయానికి, అనారోగ్యానికి, అనిశ్చితికి సూచన. ఇది మన మానసిక అనాసక్తిని తెలియచేస్తుంది.
బ్రౌన్ 
బ్రౌన్  ఇహ లోక భోగాలకు గుర్తు. కనుక మీరు ఏ విషయంలోనైనా బాధ పడుతున్నట్లయితే దాని గురించి ఓదార్పు పొందబోతున్నారని అర్ధం.
బంగారం
బంగారం దైవత్వానికి గుర్తు. కనుక మీ సమస్యలలో భగవంతుని సాయాన్ని పొందబోతున్నారని అర్ధం.
వెండి
ఇమేజ్
వెండి పవిత్రతకు, న్యాయానికి గుర్తు. మీరు దేనినైనా ఎదుర్కోవటానికి కావలసిన గొప్ప శక్తి మీకు రాబోతోందని అర్ధం.
నలుపు
నలుపు అపాయానికి, మరణానికి, దుఃఖానికి గుర్తు. అంటే ఏదో ఒక అపాయాన్ని ఎదుర్కోబోతున్నారని అర్ధం. అయితే కలలో మీరు ఆనందిస్తున్నట్లయితే భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని అర్ధం.
తెలుపు 
తెలుపు పవిత్రతకు, శాంతికి, చైతన్యానికి గుర్తు. జీవితం పట్ల కొత్త దృక్పధాన్ని ఏర్పరుచుకుంటారని అర్ధం.
నలుపు-తెలుపు
నలుపు-తెలుపుల మిశ్రమం విచారానికి గుర్తు.  ఏదైనా రెండు నిర్ణయాలలో ఏది తీసుకోవాలో తెలియనప్పుడు ఈ రంగు కనిపించవచ్చు. రెండింటి మధ్య సమన్వయం సాధించి సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవలసిన అవసరాన్ని ఇది తెలియచేస్తుంది.
బర్గండి
ఇమేజ్
బర్గండి అభివృద్దిని, విజయాన్ని తెలియచేస్తుంది. మీ వృత్తిలో గొప్ప అధికారాన్ని పొందుతారని అర్ధం. 
నీలం
నీలం రంగు సత్యానికి, వివేకానికి గుర్తు. కలలో నీలం రంగు కనిపిస్తే అది భవిష్యత్తు పట్ల మన ఆశావహ దృక్పధాన్ని తెలియచేస్తుంది.
ఆకుపచ్చ
ఆకుపచ్చ అభివృద్ధికి, ఆరోగ్యానికి, శాంతికి, ఆశకు గుర్తు. బాగా డబ్బును సంపాదించి అన్ని రకాలుగా అభివృద్దిని పొందుతారని అర్ధం. అయితే ముదురు ఆకుపచ్చ మోసానికి, అసూయకు గుర్తు. కనుక ఈ రంగు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. 
ఎరుపు
ఎరుపు శక్తికి, ధైర్యానికి, దుడుకుతనానికి సూచన. ఇది అపాయాన్ని, సిగ్గుని కూడా తెలియచేస్తుంది. కనుక కలలో ఈ రంగును చూస్తే మీరు ఏ పని అయినా చేయబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించటం మంచిది. 
మెరూన్
ఇమేజ్
మెరూన్ బలానికి, ధైర్యానికి సూచన. రానున్న సమస్యలను ధైర్యంతో ఎదుర్కుంటారని దీని భావం.
గులాబీ
గులాబీ దయను, ప్రేమను, సంతోషాన్ని తెలియచేస్తుంది. ఇది మీరు ప్రేమలో పడ్డారని, లేక భవిష్యత్తులో ప్రేమలో పడతారని తెలియచేస్తుంది.
పసుపు 
పసుపు శక్తికి, ధైర్యానికి, సంతోషానికి ప్రతీక. ధైర్యంతో సమస్యలను ఎదుర్కొంటారని అర్ధం. అయితే కలలో ఈ రంగుతో పాటు మీరు బాధ పడుతున్నట్లయితే మీరు నిర్ణయాలు తీసుకోవటంలో పిరికిగా, బలహీనంగా ఉన్నారని అర్ధం.
ఆరెంజ్
ఆరెంజ్ రంగు స్నేహానికి, మర్యాదకు సూచన. మీరు కొత్త విషయాలలో ఆసక్తి చూపబోతున్నారని అర్ధం.
ఊదా 
ఇమేజ్
ఊదా అందాన్ని, శాంతిని తెలియచేస్తుంది. బంధాన్నిధృడం చేసుకోటాన్ని, అర్ధంకాని విషయాలను అర్ధం చేసుకోవటాన్ని ఇది తెలియచేస్తుంది.

4 comments:

  1. మీ రంగుల కలలు బాగున్నాయి:)

    ReplyDelete
  2. మీరందిస్తూన్న ప్రతి సమాచారం చాలా విలువైనది
    బైదిబై నా బ్లాగు పేరు కూడా దర్పణమే

    ReplyDelete
  3. kalalo pamu tharumukoni katu veyakunda untey

    ReplyDelete