పైసా కూడా ఖర్చు లేకుండా మీరు అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేయవచ్చు. ఈరోజుల్లో కొన్ని వెబ్ సైట్స్ ఆటలు ఆడడం ద్వారానో లేక ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవడం ద్వారానో అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేసే అవకాశం కల్పిస్తున్నాయి.
అందుకు అనుగుణంగా తమ వెబ్ సైట్స్ డిజైన్ చేస్తున్నాయి. ఇది చాలా సులభం. ఉదాహరణకు ఫ్రీ రైస్ వెబ్ సైట్ చూడండి.
దీనిలో ఒక ఇంగ్లీష్ పదం, దాని క్రింద నాలుగు ఆప్షన్ జవాబులు ఉంటాయి. వాటిల్లోనుండి ఇచ్చిన పదానికి సరిఅయిన జవాబును క్లిక్ చేయాలి. ప్రతి సరిఅయిన జవాబుకు 10 బియ్యం గింజలు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు డొనేట్ చేయబడతాయి. ఒకవేళ మీ జవాబు తప్పు అయితే సరి అయిన జవాబు మీకు చెప్పబడుతుంది. అంతేకాకుండా మరల వేరే పదాలనుండి మొదలు పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎంత సేపైనా ఆడుకుంటూ, కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు తెలుసుకుంటూ, మీ వంతు బియ్యం గింజలు సహాయం చేయవచ్చు.
హంగర్ సైట్ కూడా ఇలాంటిదే. కాకపోతే దాంట్లో మీరు చెప్పబడిన చోట క్లిక్ చేస్తే చాలు. ఇంకా ఆ సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని కొనవచ్చు. వీటి ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు ఆహారపదార్ధాలని కొని ఆకలితో ఉన్నవాళ్ళకు సహాయం చేస్తారు.
No comments:
Post a Comment