ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా! తెల్ల ఉల్లిపాయలు అన్ని రకాల ఉల్లిపాయలలోకి శ్రేష్టమైనవి. ఉల్లిపాయలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను క్రమబద్దీకరిస్తాయి.
ఉల్లిపాయల వలన ఉన్న కొన్ని ఉపయోగాలు చూద్దాం.
- పడుకునేముందు చిన్న చెంచా ఉల్లిపాయల రసం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
- రోజూ పులిపిరికాయల మీద ఉల్లిపాయల రసం రాస్తుంటే అవి క్రమంగా తగ్గిపోతాయి.
- పడుకునే మంచం చుట్టూ కొంచెం ఉల్లిపాయల రసం చల్లితే దోమలు రాకుండా ఉంటాయి.
- చిన్న ముక్క ఉల్లిపాయను కొంచెం చక్కెరతో కానీ, పెరుగుతో కానీ తీసుకుంటే దీర్ఘకాలికంగా ఉన్న రక్తమొలలు తగ్గిపోతాయి.
- చెంచా పచ్చి ఉల్లిపాయల రసం రోజూ రెండు లేక మూడు సార్లు తీసుకుంటే ఆస్తమా, ఛాతిలో పట్టుకోవడం, ఇంకా ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. ఇది గుండెకు కూడా మంచిది.
- పచ్చి ఉల్లిపాయల ముక్కలు పంటి ఆరోగ్యానికి కూడా మంచివి.
- పచ్చి ఉల్లిపాయలను, జీలకర్రను సమభాగాలుగా తీసుకొని నెయ్యిలో వేయించి పొడి చేయాలి. దానికి అంతే మొత్తం పటికబెల్లంను కలిపి ఒక చెంచా చొప్పున రోజూ రెండు లేక మూడు సార్లు తింటే కాలిపగుళ్ళు పోతాయి.
- 30 గ్రాముల ఉల్లిపాయల రసం, 10 గ్రాముల అల్లం రసం, 20 గ్రాముల తేనెతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది.
No comments:
Post a Comment