Sunday, April 10, 2011

ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు

మెదడు అన్ని అవయవాల పనితీరుని నిర్దేశిస్తుందని తెలుసు కదా! అయితే కొన్ని విషయాలలో ఆడవారు స్పందించే విధానానికి, మగవారు స్పందించే విధానానికి తేడా ఉంటుంది. దీనికి కారణం వారి మెదడులో జరిగే మార్పులే.


అనేకమంది మీద పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఆడ, మగ మెదళ్ళలోని కొన్ని తేడాలు కనిపెట్టారు. వీటిని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చదవచ్చు.
  • మగవారి మెదళ్ళు పెద్దగా ఉంటాయి. కానీ వయసుతోపాటు, అదే వయసున్న ఆడవారి మెదళ్ల కంటే త్వరగా  కుంచించుకు పోతాయి. 
  • ఆలోచించేటప్పుడు మగవారి కంటే ఆడవారు  మెదడుని ఎక్కువగా వాడతారు. 
  • మన మెదడులో గ్రే మాటర్, వైట్ మాటర్ అని రెండు ఉంటాయి. గ్రే మాటర్ తార్కిక శక్తికి, వైట్ మాటర్ జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. మగవారి మెదళ్ళలో గ్రే మాటర్ ఆడవారి మెదళ్ళలో కంటే 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆడవారి మెదళ్ళలో వైట్ మాటర్ మగవారి మెదళ్ళలో కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిశోధకులు ఏమంటున్నారంటే మగవారు లెక్కలు వంటివాటిలో నిష్ణాతులని, ఆడవారు సాహిత్యం, భాష వంటివాటిలో పండితులని. 
  • ఆడవారి మెదళ్ళు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ గ్లూకోస్ ని వాడుకుంటాయి.  
  • "ఇంటలిజెన్స్" పత్రిక 2006 లో చేసిన సర్వే ప్రకారం జ్ఞాపకశక్తి పరీక్షల్లో మగవారు సగటున నాలుగు నుండి ఐదు పాయింట్లు ఎక్కువగా సాధించారు.  
  • మగవారు సెక్స్ గురించి చాలా ఎక్కువగా అంటే నిముషానికి ఒకసారి చొప్పున, ఆడవారు చాలా తక్కువగా అంటే ఒకటి లేక రెండు రోజులకు ఒకసారి చొప్పున ఆలోచిస్తారు. 
  • శిశువుల మీద చేసిన పరిశోధనలలో డిస్టర్బ్ చేసే ధ్వనులకు మగశిశువుల కంటే ఆడశిశువులు  ఎక్కువ ప్రతిస్పందించారు. 
  • ఆడవారు మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు. దీనికి కారణం వారి మెదళ్ళలోని కొన్ని గ్రంధుల చర్యలే. ఆడవారు, మగవారు రోజూ మాట్లాడే మాటల మధ్య తేడా సగటున 1000 నుండి  10,000  వరకు ఉంటుంది.
  •  ఆడవారు మగవారి కంటే ఎక్కువగా స్పర్శకు ప్రభావితమవుతారు. 20 సెకండ్ల కౌగిలింత ఆడవారి మెదడులో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇది తనను కౌగిలించుకున్న వ్యక్తి మీద నమ్మకాన్ని కలిగించటానికి దోహదపడుతుంది.

2 comments:

  1. నేను మగవాడినే కానీ గణితంలో వీక్. కాల్యుకులేటర్ లేకపోతే లెక్కలు చెయ్యలేను. నాకు సాంకేతిక విషయాలు బాగా తెలుసు. మానిటర్‌లో ఎన్ని డయోడ్స్ ఉంటాయి, LOT ఎలా పని చేస్తుంది, సీగేట్ కంపెనీ HDDలో డిస్క్ ప్లేట్ నిముషానికి ఎన్ని సార్లు తిరుగుతుంది వగైరా విషయాలన్నీ నాకు తెలిసినవే. జ్ఞాపక శక్తి అనేది కాన్సెంట్రేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పరిశోధనలోనే లోపం ఉందని నాకు అనిపిస్తోంది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు, మీరు చెప్పింది నిజమే. లెక్కల్లో నిష్ణాతులైన ఆడవారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు మానవ కంపూటర్ శకుంతలాదేవి స్త్రీయే కదా! ఈ పరిశోధనలు అనేవి జనరల్ గా కొంతమంది మీద సర్వే చేసి చెపుతారు. అందుకనే వాటికి ఎక్సెంప్షన్లు ఉంటాయి. ఇవి ఓవరాల్ గా తీసుకోవచ్చు. అంతేకానీ అందరూ ఇంతే అని ఒక నిర్ణయానికి రాలేము.

    ReplyDelete