అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే రానున్న రెండేళ్ళలో ఆవులు అమ్మ పాలు ఇస్తాయి. చైనా శాస్త్రవేత్తల బృందం లీ నింగ్ ఆధ్వర్యంలో అవులలోని కొన్ని జీన్స్ మార్చటం ద్వారా ఈ ప్రయోగం చేసారు.
ఇమేజ్
పూర్వకాలంలో చైనాకు చెందిన చక్రవర్తులు, మహారాణులు వాళ్ళ జీవితకాలం మొత్తం తల్లి పాలు తాగేవారు. ఇది చాలా గొప్పగా భావించేవారు. వీటిని తాగే అవకాశం సామాన్య మానవులకు కూడా దక్కాలని తాము ఈ ప్రయోగం చేసినట్టు లీ నింగ్ చెప్పారు.
తల్లిపాలు వ్యాధినిరోధక శక్తిని, తెలివితేటలను పెంచుతాయని ఎంతోమంది పిల్లల మీద చేసిన పరిశోధనలలో రుజువైంది. తల్లిపాలలో ఉన్న పదార్ధాలు ఆవు పాలలో కానీ, మేక పాలలో కానీ ఉండవు. ఈ పాల రుచి మామూలు పాల రుచి కంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
ఇవి మామూలు ఆవు పాల వలె సురక్షితమేనని పరిశోధకులు చెప్తున్నప్పటికీ, చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ 22 నెలలపాటు వీటిని ప్రయోగశాలల్లో పరీక్షించిన పిదప ఎలాంటి నష్టం లేకపోతే అమలులోకి తేవాలని నిర్ణయించింది. దీనికోసం అనుమతి మంజూరు చేసింది.
గత సంవత్సరం న్యూయార్క్ కు చెందిన చెఫ్ డానియెల్ యాంగరార్ మిగిలిపోయిన తన భార్య పాలతో జున్ను చేసి అమ్మాడు. దీని మీద పెద్ద దుమారమే చెలరేగింది.
ఇటివలే లండన్ కు చెందిన ఒక రెస్టారెంట్ తల్లిపాలతో చేసిన ఐస్ క్రీం బేబీగాగాను అమ్మటం మొదలు పెట్టింది. అయితే దీనివల్ల వైరస్, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని దీనిని నిషేధించారు.
ఇప్పుడు ఈ ఆవులు ఇచ్చే అమ్మపాల ఫలితాలు ఏమిటో తెలియాలంటే రెండేళ్ళదాకా ఆగాల్సిందే.
No comments:
Post a Comment