Wednesday, March 23, 2011

ఆనందానికి అయిదు ఆహార పదార్ధాలు


మనం తీసుకొనే ఆహారం మన మూడ్ ని మార్చగలదని ఎన్నో పరిశోధనలలో రుజువైంది. కొన్ని ఆహార పదార్ధాలు మన ఆనందాన్ని పెంచుతాయి. ఈసారి మీ మూడ్ బాగాలేనప్పుడు క్రింద చెప్పిన ఆహార పదార్ధాలు తీసుకొని చూడండి.

ఈ అయిదు ఆహార పదార్ధాలు మీ ఆనందాన్ని పెంచుతాయి.
ఇమేజ్
అరటిపండు: అరటిపండులోని బి6  ట్రిఫ్తోఫాన్ ను సెరిటోనిన్ గా మార్చడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నీరసాన్ని దూరం చేసి వెంటనే శక్తినివ్వటంలో దానికదే సాటి. 

ఇమేజ్
అక్రూట్ కాయలు (వాల్ నట్స్): అక్రూట్ కాయలలోని ఒమేగా-3 - ఫ్యాటీ ఆమ్లాలు వత్తిడిని తగ్గించి మనలోని నెగటివ్ భావనలను తొలగిస్తాయి.

గుడ్లు:  గుడ్లలోని ప్రోటీన్లు, విటమిన్ బి, బి2,  బి5,  డి బ్లడ్ షుగర్ ను (రక్తంలో చక్కెర శాతాన్ని) అదుపులో ఉంచటమే కాక ఎమోషన్ లను కూడా అదుపు చేస్తుంది.

ఇమేజ్
చాకొలేట్:  చాకొలేట్ ను ఇష్టపడని  వారుంటారా? అయితే మిల్క్ చాకొలేట్ కంటే డార్క్ చాకొలేట్ తింటే ఎక్కువ ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు. డార్క్ చాకొలేట్ లో కోకోవా శాతం ఎక్కువగా ఉంటుంది. కోకోవా లోని సహజ సిద్ధమైన ఫ్లేవనాయిడ్లు  మెదడుకు రక్తసరఫరాను పెంచి మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి. ఇంకా దీనిలోని ఫినైల్- ఇథైల్ - అమిన్, టైరమిన్ ఉత్సాహాన్నిపెంపొందించడంలో సహాయపడతాయి. 

ఇమేజ్ 
సన్ ఫ్లవర్ గింజలు: సన్ ఫ్లవర్ గింజలలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం అలసట, ఆందోళన, నిద్రలేమి, నెర్వస్ నెస్ మొదలైన వాటినన్నింటినీ తగ్గిస్తుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది.

మరింకెందుకు ఆలస్యం?

2 comments:

  1. ఆలిస్యం ఎందుకు మీరు ఇంత చక్కగా తెలిపాక

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు నా కృతజ్ఞతలు.

    ReplyDelete