ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మార్చ్ ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణంలో జరిగే మార్పుల పట్ల ప్రజలలో అవగాహన కలిగించడమే. ఈ నెల అంటే మార్చ్ 26వ తారీఖు రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు ఎర్త్ అవర్ జరుగుతుంది.
గత సంవత్సరం కూడా మనదేశంలో ఎర్త్ అవర్ జరుపుకున్నారు. కాని ఇంకా చాలామందికి దీనిపట్ల అవగాహన లేకపోవటం వలన ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద దేశమైన మనదేశంలో తగినంత విద్యుత్ ఆదా చేయలేక పోయారు.
ఈ సంవత్సరం మీరు మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. అందరూ ఎర్త్ అవర్ పాటించేట్లు చేయండి.
ఎర్త్ అవర్ జరుపుకోవడానికి కొన్ని సూచనలు:
1. రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు అన్ని లైట్లు, మిగిలిన ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయండి.
2. డాబా ఎక్కి చంద్రుడిని, నక్షత్రాలను గమనించండి.
3. అంత్యాక్షరి ఆడుకోండి. కీబోర్డ్ కానీ, గిటార్ కాని వాయించండి.
4. వెన్నెల వెలుగులో భోజనం చేయండి.
5. మరీ చీకటిగా ఉంటే క్యాండిల్ వెలిగించుకొండి.
ఎర్త్ అవర్ని సక్రమంగా జరిపి మన భూమికి, పర్యావరణానికి కొంతఅయినా మేలు చేద్దాం.
No comments:
Post a Comment