Monday, March 28, 2011

గర్భిణీ స్త్రీల యొక్క ఐరన్ లోపం పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది

గర్భిణీ స్త్రీలు వారి మొదటి మూడు నెలలలో ఐరన్ లోపాన్ని కలిగి ఉంటే వారి బిడ్డల మెదడు ఎదుగుదల సరిగా ఉండదు.  ఈ ఐరన్ లోపం రక్తహీనతను కలిగించేటంత ఎక్కువగా ఉండక పోయినా కూడా ఇది వారికి పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.



యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ వారి పరిశోధన ప్రకారం తల్లి యొక్క ఐరన్ లోపం పుట్టబోయే బిడ్డ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ (సెంట్రల్ నెర్వస్ సిస్టం) మీద ప్రభావం చూపుతుంది. ఐరన్ లోపం స్త్రీలలో సహజం. ఆరోగ్యవంతులైన స్త్రీలలో కూడా 35 నుండి 58 శాతం మంది ఎంతో కొంత ఐరన్ లోపాన్ని కలిగిఉంటారు.   నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి లెక్కల ప్రకారం ఋతుచక్రం మొదలైన తర్వాత ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు తీవ్రమైన ఐరన్ లోపం మరియు ఎనిమియాతో బాధపడుతున్నారు. 



ఐరన్ లోపాన్ని కలిగి ఉన్న పిల్లల్లో ప్రవర్తనాపరమైన సమస్యలు ఎక్కువ. అంతే కాకుండా వారు ఏ విషయాన్నీ త్వరగా నేర్చుకోలేరు. ఇప్పటిదాకా శాస్త్రవేత్తలకు తల్లిలో  ఎంత  శాతం ఐరన్ లోపిస్తే  బిడ్డ మీద ప్రభావం చూపుతుందో తెలియదు. ఈ కొత్త పరిశోధన చాలా తక్కువ ఐరన్ లోపం కూడా బిడ్డను ప్రభావితం చేయగలదని రుజువైంది. కనుక రక్తహీనత లేనంత మాత్రాన ఐరన్ లోపం లేదనుకోవద్దని, తల్లి కావాలనుకున్న ప్రతి స్త్రీ ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు అంటే మాంసాహారులైతే కాలేయం, చేపలు వంటివి, శాఖాహరులైతే ఓట్స్, కరివేపాకు, నువ్వులు, ఆకుకూరలు, దాల్చిన చెక్క, గోధుమలు, బీన్స్ వంటివి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment