Friday, March 25, 2011

వింత పెన్నులు

పెన్నులు రాయడానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వింత పెన్నులు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.

కలర్ పికర్ - రంగులను గ్రహించే పెన్ను


ఈ వింత పెన్ను పేరు కలర్ పికర్. దీనిని జిమ్సన్ పార్క్ తయారుచేసాడు. ఈ పెన్నును దేనిమీద పెడితే దాని రంగును గ్రహిస్తుంది. ఉదాహరణకు ఆపిల్ మీద పెడితే ఎర్ర రంగు, ఆకుల మీద పెడితే ఆకుపచ్చ రంగు ఇలాగన్నమాట. ఆ రంగుతో కావలసిన బొమ్మలు గీసుకోవచ్చు.  

ఎల్ ఇ డి పెన్ను


ఈ పెన్నులోని ఎల్ ఇ డి చీకటిలో రాసేటప్పుడు వెలుగుతుంది. దానివల్ల రాత్రి పూట కూడా ఎంతో ఈజీగా రాసుకోవచ్చు. 

లైవ్ స్క్రైబ్
ఇమేజ్

లైవ్ స్క్రైబ్  రాసిన లేక చెప్పిన మ్యాటర్ ను రికార్డ్ చేసి అవసరం వచ్చినపుడు మనకు వినిపిస్తుంది. 200 గంటల ఆడియో కానీ 32,000 పేజీల నోట్స్ కానీ దీనితో మనం రికార్డ్ చేసుకోవచ్చు.

ఫిషర్ స్పేస్ పెన్ను

జీరో గ్రావిటీ కలిగి ఉండటం వల్ల ఈ పెన్ను అంతరిక్షంలో కూడా రాస్తుంది.  ఈ పెన్నుతో మీరు నీళ్ళలో, తడి మరియు  నూనె పేపర్ మీద, విపరీతమైన ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా రాయగలరు. 

క్విక్షనరి టి ఎస్ ప్రీమియం పెన్ను



విజ్ కాం టేక్నోలజిస్   వారి పెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తయారు చేసిన క్విక్షనరి టి ఎస్ ప్రీమియం పెన్ను రకరకాల భాషలలో ఉన్న మ్యాటర్ ను కావలసిన భాషలోకి అనువదిస్తుంది. అంతే కాకుండా ప్రింటెడ్ మ్యాటర్ ను స్కాన్ చేస్తుంది. అవసరమైనప్పుడు దానిని కంప్యూటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment