Tuesday, March 29, 2011

ఆడ, మగ వాళ్ళలో ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు

మీరెప్పుడైనా "ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు? ఆడవారా లేక మగవారా?" అని ఆలోచించారా? తమ సగటు అరవై ఏళ్ల జీవితంలో మగవారు కనీసం లక్షసార్లు, ఆడవారు యాభైవేలసార్లు అబద్ధాలు ఆడతారు. 


బ్రిటన్ పరిశోధకులు మాడువేల మంది  మీద  జరిపిన పోల్ లో  ఆడవారి కంటే మగవారు రెట్టింపు శాతం అబద్దాలు చెప్తారని తెలిసింది.

మగవారు సాధారణంగా భార్య లేక ప్రియురాలితో చెప్పే అబద్ధాలు:
  1. నేను నువ్వనుకున్నంత ఎక్కువగా డ్రింక్ చేయలేదు (బాగా తాగి వచ్చి భార్య కోపంగా ఉన్నప్పుడు)
  2. ఇంకోసారి తాగను లేక ఇదే నా ఆఖరి సిగరెట్ (ఈ అలవాట్లు ఎప్పుడు మానేస్తావ్ అని అడిగినప్పుడు)
  3. నాకు సిగ్నల్ లేదు (ఫోన్ తీయలేదేమని అడిగినప్పుడు)
  4. నువ్వు ఈ మధ్య చాలా స్లిమ్ గా, అందంగా కనిపిస్తున్నావు  ( భార్య లేక ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు)
  5. నేను ఇంటికే బయలుదేరాను. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను (ఏదైనా ప్రోగ్రాం వేసుకుని అనుకున్న సమయానికి ఇంటికి రానప్పుడు)
ఆడవారు సాధారణంగా తమ భాగస్వామితో చెప్పే అబద్ధాలు:
  1. నేను బాగానే ఉన్నాను (ఏంటలా ఉన్నావ్ అని అడిగిన భర్తతో)
  2. నాకేం తెలుసు? నేను దానిని చూడను కూడా చూడలేదు (ఏదైనా వస్తువు ఎక్కడుంది అని అడిగినప్పుడు)
  3. అది పెద్ద ఖరీదేమీ కాదు. చాలా తక్కువకు కొన్నాను (బట్టలు, కాస్మెటిక్స్ లాంటివి కొన్నప్పుడు)
  4. నాకు తలనెప్పిగా ఉంది (భర్త మీద కోపం వచ్చి దూరంగా ఉండాలనుకున్నప్పుడు)
  5. నేనేం పారేయలేదు (ఏదైనాకనిపించనప్పుడు పారేశావా  అని అడిగితే)
అంతేకాక 82 శాతం మంది ఆడవారు, 70 శాతం మంది మగవారు తాము అబద్ధం ఆడినందుకు గిల్టీగా ఫీల్ అవుతామని చెప్పారట!

No comments:

Post a Comment