Saturday, March 26, 2011

ఎర్త్ అవర్ గుర్తుందా

ఎర్త్ అవర్ గుర్తుందా? అది ఈ రోజే. రాత్రి పూట 8.30 నుండి 9.30 వరకు. ఎర్త్ అవర్ మొదటిసారిగా 2007 లో సిడ్నీలో జరిగింది. 22 లక్షలమంది సిడ్నీ ప్రజలు అనవసరమైన లైట్లు అన్నింటిని ఆపివేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని 2008  వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎర్త్ అవర్ ఉద్యమంలో పాల్గొన్నాయి.

ఇమేజ్
డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్. (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఇండియా లెక్కల ప్రకారం 2009 వ సంవత్సరంలో 50 లక్షలమంది భారతీయులు, 58 పట్టణాలు ఎర్త్ అవర్ లో పాల్గొన్నాయి. ఎందుకంటే అది వాతావరణంలో కలిగే మార్పుల పట్ల భారతప్రజలకు అవగాహన కలిగించడానికి చేసిన మొదటి ప్రయత్నం. 2010 వ సంవత్సరంలో 60 లక్షలమంది భారతీయులు, 128 పట్టణాలు ఎర్త్ అవర్ లో పాల్గొన్నాయి. 6 లక్షలమంది విద్యార్ధులు, 120 ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు ఈ ఉద్యమంలో పాలు పంచుకొన్నాయి.


పై లెక్కలు చూస్తూంటే మీకేమనిపిస్తోంది? మన దేశ జనాభాకు, ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి నిష్పత్తి ప్రకారం చూస్తే కనీసం ఒక్క శాతంమంది కూడా దీనిలో పాల్గొనలేదని.


ఇమేజ్ 

ఈ సంవత్సరం ఇంకా ఎక్కువమంది పాల్గొనాలని, అవసరమైతే గంట కంటే ఎక్కువసేపు ఉండాలని డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్. ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఎర్త్ అవర్ గురించి ముమ్మరమైన ప్రచారం చేయిస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు, సినిమా నటులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


మన భారతీయులు అన్నింటిలో ముందుంటారు. ఏదైనా అనుకొన్నారంటే సాధించే దాకా వదలరు. నిజానికి సహజ వనరులని కాపాడుకోవటంలో భారతీయుల తర్వాతే ఎవరైనా!  కాకపోతే చాలామందికి ఇంకా ఎర్త్ అవర్ గురించి తెలియదు. కనుక తెలియనివారందరికీ చెప్పి వారిని చైతన్యవంతులను చేద్దాం.

No comments:

Post a Comment