Thursday, September 11, 2014

50 లక్షల జిమెయిల్ అకౌంట్ల హ్యాకింగ్

రష్యన్ హ్యాకర్ల వల్ల 50 లక్షల జిమెయిల్ అకౌంట్ల హ్యాకింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలు చాలామందిని ఆందోళనకు గురి చేశాయి. ఎందుకంటే ఈరోజుల్లో దాదాపు అందరూ జిమెయిల్ వాడటమే కాదు మొత్తంగా అన్ని పనులు దాని ద్వారానే జరుపుతున్నారంటే  అతిశయోక్తి కాదు. 

సోషల్ నెట్ వర్కింగ్ కోసం, బ్యాంకు వ్యవహారాల కోసం, యూట్యూబ్ వీడియోల కోసం, చివరికి బ్లాగ్ రాయటానికి కూడా జిమెయిల్ కావాలి. అంతగా మనకు తెలియకుండానే దానిమీద ఆధారపడ్డాము. ఇలాంటి సమయంలో అకౌంట్ హ్యాక్ అయిందంటే ఆందోళన పడటం సహజమే. ముఖ్యంగా మన నెట్ బ్యాంకింగ్ వ్యవహారాలు లేక పేపాల్ వంటి వాటికి జత చేసిన మెయిల్ అకౌంట్ కు ఏమైనా అయిందంటే ఆ టెన్షన్ చెప్పనలవి కాదు. 

ఇమేజ్

ఈ హ్యాకింగ్ గూగుల్ సర్వర్ ద్వారా జరిగింది కాదని, రష్యన్ ఫిషింగ్ స్కాం ద్వారా బలహీనమైన పాస్ వర్డ్స్ ఉన్న అకౌంట్లు హ్యాకింగ్ కు గురి అయ్యాయని తెలిసింది. మన అకౌంట్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే https://isleaked.com/en వెబ్ సైట్ లోకి వెళ్లి మన  జి మెయిల్ అకౌంట్ టైపు చేసి చెక్ చేసుకోవచ్చు. మన ఈ మెయిల్ అకౌంట్ వేరే వాళ్ళకు తెలియవలసిన అవసరం లేదు కనుక దాంట్లోని మొత్తం టైపు చేయకుండా, మూడు అక్షరాలు వదిలేసి వాటికి బదులుగా *** టైపు చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన అకౌంట్ దాంట్లో ఉంటే, వెంటనే సెక్యూరిటీ క్వశ్చన్ కు జవాబివ్వటం ద్వారా పాస్ వర్డ్ మార్చుకోవటం, ఇంకా రెండంచెల విధానం ద్వారా (టూ స్టెప్) వెరిఫికేషన్ చేసుకోవటం చేయాలి.లేకపోతే https://joodle.nl/around-5-million-compromised-google-accounts-leaked/ వెబ్ సైట్లోకి వెళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ  హ్యాక్ అయిన మొత్తం ఈమెయిలు అకౌంట్స్ లిస్టు ఉంది. ఆ ఫైల్ చాలా పెద్దది కనుక 7 చిన్న ఫైల్స్ గా ఇవ్వటం జరిగింది. 

ఇమేజ్

మన అకౌంట్ హ్యాక్ కాకపోయినా కూడా జి మెయిల్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా పాస్ వర్డ్ మార్చుకోవటం మంచిదని కూడా వారి సలహా. ఇంకా వారేమంటున్నారంటే, తరుచుగా పాస్ వర్డ్ మార్చుకోవాలని, అది కూడా బలహీనమైనదయి ఉండకూడదని, అన్ని అకౌంట్స్ కు ఒకటే పాస్ వర్డ్ పెట్టటం మంచిది కాదని. కనుక ఈ జాగ్రత్తలు పాటించి మీ అకౌంట్ ని భద్రంగా ఉంచుకోండి. 

No comments:

Post a Comment