ఈరోజుల్లో ఆప్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వినియోగదారులను ఆకట్టుకోవటానికి దాదాపు అన్ని కంపెనీలు ఆప్స్ డిజైన్ చేసి వాటిని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. కొంతమంది ఆప్స్ కు ప్రాచుర్యం కలిగించటానికి ఫ్రీ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. వీటిల్లో కొన్నింటిని చూద్దాం.
అమెజాన్ కంపెనీ ఆప్ ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు ఆపిల్ మాక్ బుక్ ఎయిర్ గెలుచుకునే అవకాశం కల్పించింది. దీనికోసం వాళ్ళ వెబ్ సైట్ కు వెళ్లి ఫోన్లో కానీ, టాబ్లెట్ లో కానీ వాళ్ళ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే డౌన్లోడ్ చేసుకోవటానికి లాగిన్ అవ్వాలి. అంతకుముందు మెంబర్ కాకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అవకాశం ఆగష్టు 25 నుండి మొదలైంది. సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. దీనికోసం ఎలాంటి కొనుగోళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరిలో నుండి ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతి ఇస్తారు. విజేతను సెప్టెంబర్ 19న ప్రకటిస్తారు.
రెడ్ బస్ ఆప్ ద్వారా టికెట్ బుక్ చేసుకొని RBAPP100 కోడ్ వాడితే వందరూపాయల తగ్గింపు లభిస్తుంది. ఇక RBHOT25 కోడ్ ఉపయోగిస్తే అన్ని హోటల్స్ లో 25% తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ఆఫర్స్ గురించి తెలియని వాళ్ళు ఎక్కువగా ఉండక పోవచ్చు. ఇంకా చాలా కంపెనీలు వాళ్ళ ఆప్స్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఆఫర్స్ ఇస్తున్నాయి. ఈఆప్స్ వల్ల వినియోగదారులకు ఎంత లాభమో తెలియదు కానీ ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్నందువల్ల కంపెనీలకు ఎంతో పబ్లిసిటీ వస్తుంది.
కంపెనీలే కాదు, బ్యాంకులు కూడా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తున్నాయి. అంటే మొబైల్ లోనే దాదాపు అన్ని పనులు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఆఫర్ల కోసం కాకుండా నిజంగా మనకు అవసరమైన ఆప్స్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే సమస్య ఉండదు.
ఆప్స్ హంగామా |

No comments:
Post a Comment