Saturday, September 13, 2014

కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

మనం ఇప్పుడు మన కలల్లో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటో చూద్దాం. 

జింక
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?


కలలో జింక కనిపిస్తే మీకు ఉన్న ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం. అనుకోకుండా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది. 

గాడిద 

కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?


మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతే కాక, మీకు  రాబోయే  అనేక చికాకులకు ఇది గుర్తు. మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే, చాలా సహనంతో కష్టపడిన తర్వాత, మీరు వ్యాపారంలో, ఇంకా ప్రేమలో విజయవంతమవుతారని అర్ధం. గాడిద మొండితనానికి, ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు. గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని, గాడిద తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని, గాడిద మీద ఊరేగుతూ, వెనుక చాలామంది అనుసరిస్తుంటే, అందర్నీ ఒప్పింపచేయగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది. 

గబ్బిలం 
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

ఇమేజ్   

కలలో గబ్బిలం కనిపించటం ఒక రకంగా దుశ్శకునమే. అది తెల్లగబ్బిలం అయితే కుటుంబసభ్యులలో ఒకరి మరణాన్ని, నల్లగబ్బిలం అయితే వ్యక్తిగత విపత్తుని సూచిస్తుంది. అదే పిశాచిలాంటి గబ్బిలం అయితే, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ వనరులన్నీ కోల్పోవటాన్ని సూచిస్తుంది. ఇంకో రకంగా చూస్తే, గబ్బిలాలు మీ పాత అలవాట్లను మానకపోతే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని సూచిస్తాయి. 

ఆవు 
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియా స్వభావాన్ని సూచిస్తుందిబక్కచిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజజీవితంలో మీఅమ్మ మీఅవసరాలకు సరిగా స్పందించడం లేదని, ఆమె ప్రేమని మీరు కోరుకుంటున్నారని అర్ధం. 
 
ఎద్దు 
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?


ఇమేజ్

మీకలలో ఎద్దును చూస్తే, విస్తారమైన సంపద రాబోతోందని అర్ధం. ఆబోతును చూస్తే మీ కోరికలు మీ నియంత్రణలో లేవని అర్ధం. 

దూడ
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

కలలో దూడ కనిపిస్తే అనుభవ లేమికి సూచన. అంటే మీరు కొన్ని లక్షణాలు పెంపొందించుకుంటే కానీ జీవితంలో ఎదగలేరని అర్ధం. 

ఒంటె 
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

ఇమేజ్

మీ కలలో ఒంటెను చూశారంటే, మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని, మీ ఉద్వేగాలను వ్యక్తం చేసి, మీ బరువులు వదిలించుకోకుండా, వాటిని పట్టుకొని వేళ్ళాడతున్నారని అర్ధం. ఒక రకంగా మీరు ఎంత పెద్ద భారాన్ని అయినా మోయగలరని అర్ధం. అయితే మీలో మన్నించే గుణం, మర్చిపోవటం తక్కువ. 

పిల్లి

కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు. అయితే, పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది  సృజనాత్మకతకు, శక్తికి చిహ్నమని భావిస్తారు. మీ కలలో తెల్లపిల్లిని చూస్తే  కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లిని చూస్తే  మీరు మీమానసికసామర్ధ్యాలు ఉపయోగించటానికి భయపడుతున్నారని అర్ధం. పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే మీరు ఎప్పుడూ ఎదుటివారినుండి తీసుకునేవారుగానే ఉంటున్నారు కానీ ఇవ్వటానికి ఇష్టపడరని అర్ధం. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం లేదా నిరాశకు గురి అవ్వటానికి ఇది సూచన కావచ్చు. అయితే, మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే, మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన. 

పశువులు 

కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

పశువులు కలలో కనిపిస్తే మీరు ప్రస్తుతమున్న పరిస్థితితో లేదా బంధాలతో జాగ్రత్తగా ఉండాలని అర్ధం. కలలో పశువులమందలను చూడటం వ్యక్తిత్వం లేకపోవడానికి సూచన.

మొసలి 
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

ఇమేజ్

మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతోందని అర్ధం. మీ దగ్గర వాళ్ళలో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొల్పుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. మొసలి మిమ్మల్ని వెంటాడి కరిస్తే, ప్రేమ మరియు వ్యాపారాలలో పరాజయం పొందబోతున్నారని అర్ధం. 

కుక్క

కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?

ఇమేజ్

కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని అర్ధం. ఈ కల మీరు ద్వంద్వార్ధాలతో ఇతరులను తీవ్రంగా వేధించడానికి సూచన కావచ్చు. కుక్క కోపంగా కేకలు వేయటం మీలోపల ఉన్న అంతర్గత సంఘర్షణను సూచిస్తుంది. మరణించిన కుక్క ఒక మంచి స్నేహితుని మరణానికి సూచన. కుక్క మరణిస్తూ ఉంటే, మీలోని మంచి ప్రవృత్తులు క్షీణించిపోవటాన్ని సూచిస్తుంది. కాలు మీద కుక్క కరవటం మీ జీవితాన్ని సమతుల్యం చేసుకునే సామర్థ్యం కోల్పోవటాన్ని, ఒక కొత్తపరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవటాన్ని సూచిస్తుంది. సంతోషంగా మొరిగే కుక్క ఇతరులతో కలిగి ఉన్న చక్కటి సామాజిక సంబంధాలకు, భయంకరంగా మొరిగే కుక్క మీ చుట్టూ ఉన్నవాళ్ళతో సరి అయిన సంబంధాలు లేకపోవటానికి గుర్తు. కుక్కను కొంటున్నట్లు కల వస్తే తోడు కోరుకుంటున్నారని, కుక్కకు కట్టు కడుతున్నట్లు కల వస్తే మీలోని లోపాలు, అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధం. 

ఇంకా చాలా జంతువులు ఉన్నాయి కదా! మిగిలిన వాటి గురించి ఇంకో ఆర్టికల్లో చూద్దాం.

No comments:

Post a Comment