Thursday, September 4, 2014

సూపర్ సింగర్ 8

మా టి. వి. లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ 8 టాప్ 5 రియాల్టీ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రారంభమైన మూడువారాలలోనే ఈ మ్యూజిక్ షో టిఆర్పి 5.85 తో ఇండియాలోని అత్యుత్తమ టి. వి. రియాల్టీ షోలలో ఒకటిగా నిలవటం విశేషం.

టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం సూపర్ సింగర్ 8 టాప్ 5 రియాల్టీ షోలలో ఒకటిగా నిలిచింది. ఈ మ్యూజిక్ షో లో మొత్తం ఐదువేల మంది పోటీ పడగా, వాళ్ళలో నుండి 18 మంది ప్రతిభావంతులను ఈ ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి మరియు గాయని చిత్ర ఎంపిక చేశారు.

సూపర్ సింగర్ 8

ఇమేజ్ 

ఇప్పటిదాకా ఈ షోలో ఇంతకు ముందు సూపర్ సింగర్ షోలలో పాల్గొన్న గాయనీ గాయకులు పాడారు. అంతే కాకుండా ఈ షో లో మెంటార్స్ గా ఉండే సాకేత్, సాహితి, రమ్యల పరిచయాలతో పాటు దీనిలో పాడబోయే 18 మంది గాయనీ గాయకులని పరిచయం చేయటం జరిగింది.

ప్రతి సోమ, మంగళ వారాల్లో రాత్రి పూట తొమ్మిదిన్నర నుండి పదిన్నర వరకు వచ్చే ఈ ప్రోగ్రాంలో అసలు ఘట్టం ఇంకా మొదలవకముందే టాప్ 5 రియాల్టీ షోలలో ఉండటం కొసమెరుపు.

2 comments:

  1. ఒక్క సంగతి ఆలోచించండి.
    ఈ గాయకులను వెలికితీసే షోల వలన లాభం ఎవరికీ?
    గాయకులకా? షో నిర్వాహకులకా? ఛానెల్ వాళ్ళకా?
    మిగతా వారికే, గాయకులకు ఏ లాభమూ లేదు.
    ఉందని నమ్మి సమయమూ శక్తీ వృధా చేసుకోవటం వలన ఏ ప్రయోజనమూ లేదు.
    ఇందులో మొదటి స్థానంలో వచ్చిన వ్యక్తి ఐనా సరే ఈ నాటి తెలుగుసినీరంగంలో ఒకటి రెండు పాటలు పాడే అదృష్టానికి నోచుకుంటే గొప్పే. తొందరలో కనుమరుగే.
    ఈ నాడు సినిమాల్లో పాడేవారికి సంగీతం రావక్కర్లేదు. పాటరాసేవాడికి కనీసం భాష ఐనా సరిగ్గా రావక్కర్లేదు. సంగీతం డైరక్టర్ల గురించి చెప్పుకోవలసింది ఏమీ లేదు. నటులా - వారసులో వారసత్వపు నటులకే వారసులో - ముఖంలో హావభావాలు కూడా మృగ్యం. ఈ రణగొణసినిమాపాటలరంగంలోకి ఆశతో అడుగుపెట్టి అడుగంటి పోవటం అవసరమా?
    విద్యార్థిదశను ఈ కార్యక్రమాల చుట్టూ తిరిగి వెచిస్తే ఎటూ కాకుండా పోతుంది జీవితం. ఇది నిజం.
    ఒక్కసారి అందరూ ఆలోచించండి.

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజమే. అయినా కూడా వాళ్ళకు వచ్చే గుర్తింపో, సెలెబ్రిటీ హోదానో, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనే తపనో (ప్రత్యేకమనే భావనో) వాళ్ళని ఇలాంటి ప్రోగ్రాంలలో పాల్గొనేలా చేస్తున్నాయి.

    ReplyDelete