Thursday, September 18, 2014

వెసిల్ - పానీయాల్లోని పోషక విలువలను గుర్తించే స్మార్ట్ కప్

వెసిల్ కప్ మనం తీసుకునే పానీయాల్లోని  పోషక విలువలను గుర్తిస్తుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ కప్. దాంట్లో పోసిన పానీయం ఏమిటో, దానిలో ఏమేమి పోషక విలువలున్నాయో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరు దాంట్లో ఎంత పానీయం పోశారో, ఎంత తాగారో, ఇంకా ఎంత మిగిలి ఉందో ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది.

ఇది కొత్తగా వస్తున్న అన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల మీద ఆప్ సహాయంతో పనిచేస్తుంది. ఇంకా కొత్తగా వస్తున్న ఏ ఫోన్లతో పనిచేస్తుందో తెలియచేసే జాబితా దాన్ని డెలివరీ చేసేటప్పుడు పంపిస్తారు. ఈ కప్ మీరు తాగుతున్న పానీయాన్ని బట్టి మీఅలవాట్లను, మీరు తాగే దానిలో ఎంత ప్రోటీన్, ఎన్ని కేలరీలు ఉన్నాయో, ఇంకా మీకు ఏమేమి పోషకాలు కావాలో, ఆసమాచారమంతా దాని మీద ఉన్న ఎల్ఇడి స్క్రీన్ మీద చూపిస్తుంది.

వెసిల్ - తాగే పదార్ధాలలోని  పోషక విలువలను గుర్తించే స్మార్ట్ కప్


ఈ కప్ లో 385 మి. లీ. పానీయం పడుతుంది. దాన్ని ఛార్జ్ చేయాలంటే దానితోపాటు వచ్చిన సాసర్ మీద దాన్ని పెట్టి, సాసర్ ని  ప్లగ్ లో పెట్టి 60 నిమిషాలు ఉంచితే చాలు. వాడకాన్ని బట్టి 5 నుండి 7 రోజులు పనిచేస్తుంది. రెండు,  మూడు వెసిల్ కప్స్ ని కూడా ఒకే ఫోన్ తో అనుసంధానం చేయవచ్చు. 

వెసిల్ కప్  ధర $99. ఇప్పటికే వెసిల్ కప్ ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నారు. మొదటి బ్యాచ్ ఆర్డర్లు ముగిశాయి. ఇప్పుడు రెండవ బ్యాచ్ కు ఆర్డర్లు తీసుకోవటం మొదలైంది. ఎంత త్వరగా ఈ కప్ ని ఆర్డర్ చేస్తే, అంత త్వరగాదీన్ని అందుకుంటారు. అయితే డెలివరీ 2015 ప్రారంభంలో మాత్రమే మొదలవుతుంది. మొదటి బ్యాచ్ కు పంపించిన నెల తర్వాత రెండవ బ్యాచ్ కు డెలివరీ చేస్తారు. విదేశాలకు కూడా పంపిస్తారు. అయితే దాని మీద పన్నులు, షిప్పింగ్ ఖర్చులు అదనం.

No comments:

Post a Comment