నేను నేనేనా? లేక ఇంకెవరన్నానా? నాకేమీ అర్ధం కావటం లేదు. అసలు ఎందుకిలా జరుగుతోంది? అన్నీ అర్ధం కాని ప్రశ్నలే. నేనెందుకిలా ఆలోచిస్తున్నాను?
ఇమేజ్
"అమ్మా! నువ్వు నాన్న లాగా ప్రతి దానికీ వంకలు పెడుతున్నావు?" నా కొడుకు కంప్లయింట్.
"పెద్దమ్మ లాగా ఆవేశం ఎక్కువ" నా కూతురు ఉవాచ.
"మీ నాన్న లాగా నీకు అహంకారం" శ్రీవారి ఉద్ఘాటన.
"మీ అమ్మ లాగా నోటి దురుసు" అత్తగారి ఆగ్రహం.
"అమ్మాయ్! మీ తమ్ముడి లాగా నీకెవరితో కలవటం రాదు" మామగారి సణుగుడు.
"వదినా! నీకు మీ చెల్లెల్లాగా నిర్లక్ష్యం ఎక్కువ" నా ఆడబిడ్డ ప్రకటన.
"ఒసేవ్! పెళ్లి అయిన తర్వాత నీకూ మీ అత్తగారి గర్వం వచ్చిందే" మా అమ్మ ఆరోపణ.
"మీ మావగారి లాగా నీకు డబ్బు పిచ్చి పట్టిందే" నాన్న నస.
"అక్కా! మీ ఆడబిడ్డ లాగా నీకు కళ్ళు నెత్తికెక్కాయి" చెల్లీ, తమ్ముడి కోపం.
"నీ పిల్లల్లాగా ఎప్పుడూ టెక్నాలజీకి బానిసవే" మా అక్క ఆవేశం.
నా కంటే ముందు పుట్టిన వాళ్ళూ, నా తర్వాత పుట్టిన వాళ్ళూ, నాతోడబుట్టిన వాళ్ళూ, చివరికి నాకు పుట్టిన వాళ్ళూ కూడా నా వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రభావితం చేస్తుంటే, మరి నేను ఎవర్ని? నా స్వభావం ఏమిటో నాకే అర్ధం కావటం లేదు. అందుకే నాకు అనుమానం వచ్చింది. నేను నేను కాదుగా? ఎందుకంటే నాలో నాదంటూ ఏమీ లేదుగా.
నేను కాని నేను |

No comments:
Post a Comment