చర్మం మన శరీరంలోని భాగాలన్నింటినీ ఎండ, వాన, చలి నుండి రక్షించడమే కాక వివిధ రోగాలబారిన పడకుండా కాపాడుతుంది. కనుక వ్యాధినిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
Tuesday, April 26, 2011
Monday, April 25, 2011
నాలుక పట్ల శ్రద్ధ తీసుకోండిలా
నాలుక రుచిని తెలియచేయటమే కాక మన ఆరోగ్యాన్ని కూడా తెలియచేస్తుంది. మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు అయన మన నాలుక చూపించమనటం, దానిని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేయడం తెలిసిన విషయమే.
Sunday, April 24, 2011
ఈస్టర్ విశేషాలు
ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి.
Wednesday, April 20, 2011
చెవుల పనితీరుని, తద్వారా వినికిడి శక్తిని పెంచుకోవటం ఎలా
చెవులు వినికిడికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడతాయి. చెవులు సక్రమంగా పనిచేయకపోతే ఏ శబ్దాన్నివినలేము. ముఖ్యంగా మనగురించి ఎవరైనా మాట్లాడే మంచి మాటలు (చెడ్డ మాటలు కూడా) వినలేము. కనుక అవి పనిచేస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు.
Tuesday, April 19, 2011
ఆఘ్రాణించే శక్తిని పెంచుకోండి
కంటి తర్వాత మన జ్ఞానేంద్రియాలలో ముక్కుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏదైనా ఆహార పదార్ధాన్ని మొదట కంటితో చూసి దాని వాసన బాగుంటేనే వెంటనే తినాలనుకుంటాం. అంతేకాక ముక్కు మన శ్వాసక్రియకు కూడా ఉపయోగపడుతుంది. అలాంటి ముక్కు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మీ కళ్ళను గురించి శ్రద్ధ తీసుకోండి
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా! కళ్ళు మన జ్ఞానేంద్రియాలలో ఎంతో ముఖ్యమైనవి. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే ఎంతో కష్టం. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువకాలం కళ్ళకు ఎలాంటి సమస్యా లేకుండా చూసుకోవచ్చు. మంచి దృష్టి కూడా ఉంటుంది.
Monday, April 18, 2011
మీ కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని తెలుసుకోండి
కొన్ని కలలు మనల్ని సంతోషపెడతాయి. కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. చాలాసార్లు మన కలల భావాలు మనం తెలుసుకోలేము. అయితే కలల మీద పరిశోధన చేసి విశ్లేషించిన కొంతమంది విశ్లేషకులు మన కలలో కనిపించిన రంగు లేక వస్తువును బట్టి అది దేనికి సూచనో తెలుసుకోవచ్చంటున్నారు. ఇప్పుడు మన కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని, దాని సూచనలను తెలుసుకుందాం.
Saturday, April 16, 2011
అమ్మ పాలు ఇవ్వనున్న ఆవులు
అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే రానున్న రెండేళ్ళలో ఆవులు అమ్మ పాలు ఇస్తాయి. చైనా శాస్త్రవేత్తల బృందం లీ నింగ్ ఆధ్వర్యంలో అవులలోని కొన్ని జీన్స్ మార్చటం ద్వారా ఈ ప్రయోగం చేసారు.
తినగలిగే పెన్
చాలామంది వ్రాసేటప్పుడు పెన్నుని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఇంకు నోట్లోకి పోతే చాలా ప్రమాదం కూడా. అయినా కూడా ఈ అలవాటును మానలేనివారు ఎంతోమంది ఉన్నారు. దీనిని చూసో ఏమో డచ్ డిజైనర్ డేవ్ హాకెన్స్ తినగలిగే పెన్నును తయారుచేసాడు.
Friday, April 15, 2011
జెట్ ప్యాక్ తో నీళ్ళమీద సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపొండి
మానవుడు రాకెట్స్ లోనూ, నౌకలలోనూ ప్రయాణిస్తున్నాడు. అయినా ఇంకా ఏదో సాధించాలనే తపన కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. సినిమాలో సూపర్ మ్యాన్ లాగా, జేమ్స్ బాండ్ లాగా గాలిలో ఎగిరిపోతే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు అది విజయవంతమయింది.
మానవ శరీరానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన నిజాలు
మానవ శరీరం ఎన్నో వింతలకు నిలయం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేషనల్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ మన శరీరం గురించి చెప్పిన ఆశ్చర్యకరమైన నిజాలలో కొన్ని:
Wednesday, April 13, 2011
ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేయండి
పైసా కూడా ఖర్చు లేకుండా మీరు అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేయవచ్చు. ఈరోజుల్లో కొన్ని వెబ్ సైట్స్ ఆటలు ఆడడం ద్వారానో లేక ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవడం ద్వారానో అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేసే అవకాశం కల్పిస్తున్నాయి.
Tuesday, April 12, 2011
ఉల్లిపాయలతో ఉపయోగాలు
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా! తెల్ల ఉల్లిపాయలు అన్ని రకాల ఉల్లిపాయలలోకి శ్రేష్టమైనవి. ఉల్లిపాయలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను క్రమబద్దీకరిస్తాయి.
Sunday, April 10, 2011
ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు
మెదడు అన్ని అవయవాల పనితీరుని నిర్దేశిస్తుందని తెలుసు కదా! అయితే కొన్ని విషయాలలో ఆడవారు స్పందించే విధానానికి, మగవారు స్పందించే విధానానికి తేడా ఉంటుంది. దీనికి కారణం వారి మెదడులో జరిగే మార్పులే.
Saturday, April 9, 2011
బలమైన గుండెకు పదునైన చిట్కాలు
గుండె అవయవాలు అన్నింటిలో ముఖ్యమైనదని తెలుసు కదా! శరీర భాగాలన్నింటికీ గుండె రక్తం సరఫరా చేస్తుంది. కనుక దాని ఆరోగ్యం పైనే మిగిలిన అవయవాల ఆరోగ్యం ఆధారపడిఉంది.
Friday, April 8, 2011
మీరెప్పుడైనా కూరగాయల మ్యూజియం గురించి విన్నారా
మీరెప్పుడైనా కూరగాయల మ్యూజియం గురించి విన్నారా? బంగాళదుంపల సైనికులను, కూరగాయల మొనాలిసాను ఎప్పుడైనా చూశారా? చైనాకు చెందిన జు ద్యుయోకి కూరగాయలతో రకరకాల పెయింటింగులు తయారుచేయగలదు.
Wednesday, April 6, 2011
అద్భుతంగా పని చేసే వింత చిట్కాలు
కొన్ని చిట్కాలు వింటుంటే వింతగా ఉన్నాయనిపిస్తుంది. కానీ అవి ఫలితాన్నిచ్చినప్పుడు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతాయి. ఈ క్రింద చెప్పబడిన చిట్కాలు వింతగా ఉన్నప్పటికీ చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మీరే ప్రయత్నించి చూడండి.
Tuesday, April 5, 2011
మల్లె పూలతో టీ - ఆరోగ్యానికి ఎంతో మంచిది
ఇది మల్లె పూల సీజన్ కదా! కనుక మల్లెపూలతో టీ ఎలా చేయాలో, దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
Sunday, April 3, 2011
ఉగాది నాడు చేయవలసిన తొమ్మిది పనులు
ఉగాది ఎందుకు జరుపుకుంటారో, దాని ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మన పెద్దలు ఉగాదినాడు విధిగా చేయవలసిన కొన్ని పనులను నిర్దేశించారు. అవి:
Friday, April 1, 2011
జి మెయిల్ మోషన్: మీ కదలికలతో జి మెయిల్ కంట్రోల్ చేయండి
గూగుల్ క్రొత్త ఫీచర్ జి-మెయిల్ మోషన్. దీని ద్వారా మీరు మీ కదలికలతో జి-మెయిల్ కంట్రోల్ చేయవచ్చు.
Subscribe to:
Posts (Atom)