Saturday, December 31, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో వెలుగులు నింపాలని, అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని, కొత్త సంవత్సరం సందర్భంగా తీసుకున్న తీర్మానాలని అమలు చేయటానికి కావలసిన శక్తిని, ఆయురారోగ్యాలని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇమేజ్

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Monday, October 31, 2011

ఉట్టి అన్నం తినండోచ్

ఈ రోజు నుండి "కిలో రూపాయికే  బియ్యం" పథకాన్నిగౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు ప్రారంభించబోతున్నారు. దీనివల్ల రెండు కోట్ల మందికి  పైగా లబ్ది పొందుతారట. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు నాల్గోవంతు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నం దొరుకుతుందన్నమాట.

Friday, October 28, 2011

ప్రపంచ జనాభాలో మీరు ఎన్నవవారు

మీరెప్పుడైనా ప్రపంచ జనాభాలో ఎన్నవవారు అని తెలుసుకోవాలనుకున్నారా? అయితే పాపులేషన్ యాక్షన్ అనే వెబ్ సైట్ కు వెళ్ళండి. 

Wednesday, October 26, 2011

రొమ్ము కాన్సర్ కు ముఖ్యమైన ఐదు కారణాలు

ప్రపంచమంతా అక్టోబర్ నెలను రొమ్ము కాన్సర్ అవగాహనామాసంగా పాటిస్తారు. ఈ సందర్భంగా రొమ్ము కాన్సర్ కు కారణమయ్యే ముఖ్యమైన కొన్నింటి గురించి చూద్దాం. 

Tuesday, May 31, 2011

బేకింగ్ సోడా లేక వంట సోడా వల్ల ఉపయోగాలు

బేకింగ్ సోడా లేక వంట సోడాను మనం కేకులు, బజ్జీలు వంటివాటిలో అవి మృదువుగా రావడానికి ఉపయోగిస్తాము. కానీ బేకింగ్ సోడా వల్ల అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

Thursday, May 26, 2011

కలలో కనిపించే తినుబండారాలకు అర్ధమేమిటి

కొన్నిసార్లు మన కలల్లో తినుబండారాలు కనిపిస్తాయి. వీటిలో కొన్నిటికి అర్దాలేమిటో ఇప్పుడు చూద్దాం.

Wednesday, May 25, 2011

జీరో రుపీ నోటు గురించి మీకు తెలుసా

జీరో రూపాయల నోటు ఉందని మీకు తెలుసా? 2007 వ సంవత్సరంలో ఫిఫ్త్ పిల్లర్ అనే స్వచ్చంద సంస్థ ఈ నోటును లంచగొండితనాన్ని నిర్మూలించడానికి తయారు చేసింది. ఇది చూడడానికి అచ్చంగా నిజమైన 50 రూపాయల నోటులాగా ఉంటుంది.

Tuesday, April 26, 2011

చర్మ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

చర్మం మన శరీరంలోని భాగాలన్నింటినీ ఎండ, వాన, చలి నుండి రక్షించడమే కాక వివిధ రోగాలబారిన పడకుండా కాపాడుతుంది. కనుక వ్యాధినిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

Monday, April 25, 2011

నాలుక పట్ల శ్రద్ధ తీసుకోండిలా

నాలుక రుచిని తెలియచేయటమే కాక మన ఆరోగ్యాన్ని కూడా తెలియచేస్తుంది. మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు అయన మన నాలుక చూపించమనటం, దానిని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేయడం తెలిసిన విషయమే.

Sunday, April 24, 2011

ఈస్టర్ విశేషాలు

ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి.

Wednesday, April 20, 2011

చెవుల పనితీరుని, తద్వారా వినికిడి శక్తిని పెంచుకోవటం ఎలా

చెవులు వినికిడికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడతాయి. చెవులు సక్రమంగా పనిచేయకపోతే ఏ శబ్దాన్నివినలేము. ముఖ్యంగా మనగురించి ఎవరైనా మాట్లాడే మంచి మాటలు (చెడ్డ మాటలు కూడా) వినలేము. కనుక అవి పనిచేస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మేలు.

Tuesday, April 19, 2011

ఆఘ్రాణించే శక్తిని పెంచుకోండి

కంటి తర్వాత మన జ్ఞానేంద్రియాలలో ముక్కుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏదైనా ఆహార పదార్ధాన్ని మొదట కంటితో చూసి దాని వాసన బాగుంటేనే  వెంటనే తినాలనుకుంటాం. అంతేకాక ముక్కు మన శ్వాసక్రియకు కూడా ఉపయోగపడుతుంది. అలాంటి ముక్కు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీ కళ్ళను గురించి శ్రద్ధ తీసుకోండి

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా! కళ్ళు మన జ్ఞానేంద్రియాలలో ఎంతో ముఖ్యమైనవి. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే ఎంతో కష్టం. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువకాలం కళ్ళకు ఎలాంటి సమస్యా లేకుండా చూసుకోవచ్చు. మంచి దృష్టి కూడా ఉంటుంది.

Monday, April 18, 2011

మీ కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని తెలుసుకోండి

కొన్ని కలలు మనల్ని సంతోషపెడతాయి. కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. చాలాసార్లు మన కలల భావాలు మనం తెలుసుకోలేము. అయితే కలల మీద పరిశోధన చేసి విశ్లేషించిన కొంతమంది విశ్లేషకులు మన కలలో కనిపించిన రంగు లేక వస్తువును బట్టి అది దేనికి సూచనో తెలుసుకోవచ్చంటున్నారు. ఇప్పుడు మన కలలో కనిపించే రంగుల యొక్క భావాన్ని, దాని సూచనలను తెలుసుకుందాం.

Saturday, April 16, 2011

అమ్మ పాలు ఇవ్వనున్న ఆవులు

అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే రానున్న రెండేళ్ళలో ఆవులు అమ్మ పాలు ఇస్తాయి. చైనా శాస్త్రవేత్తల బృందం లీ నింగ్ ఆధ్వర్యంలో అవులలోని కొన్ని జీన్స్ మార్చటం ద్వారా ఈ ప్రయోగం చేసారు.

తినగలిగే పెన్

చాలామంది వ్రాసేటప్పుడు పెన్నుని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ఇంకు నోట్లోకి పోతే చాలా ప్రమాదం కూడా. అయినా కూడా ఈ అలవాటును మానలేనివారు ఎంతోమంది ఉన్నారు. దీనిని చూసో ఏమో డచ్ డిజైనర్ డేవ్ హాకెన్స్ తినగలిగే పెన్నును తయారుచేసాడు.

Friday, April 15, 2011

జెట్ ప్యాక్ తో నీళ్ళమీద సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపొండి

మానవుడు రాకెట్స్ లోనూ,  నౌకలలోనూ ప్రయాణిస్తున్నాడు. అయినా ఇంకా ఏదో సాధించాలనే తపన కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. సినిమాలో సూపర్ మ్యాన్ లాగా, జేమ్స్ బాండ్ లాగా గాలిలో ఎగిరిపోతే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు అది విజయవంతమయింది.

మానవ శరీరానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన నిజాలు

మానవ శరీరం ఎన్నో వింతలకు నిలయం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేషనల్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ మన శరీరం గురించి చెప్పిన  ఆశ్చర్యకరమైన  నిజాలలో కొన్ని:

Wednesday, April 13, 2011

ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేయండి

పైసా కూడా ఖర్చు లేకుండా మీరు అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేయవచ్చు. ఈరోజుల్లో కొన్ని వెబ్ సైట్స్ ఆటలు ఆడడం ద్వారానో లేక ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవడం ద్వారానో అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

Tuesday, April 12, 2011

ఉల్లిపాయలతో ఉపయోగాలు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా!  తెల్ల ఉల్లిపాయలు అన్ని రకాల ఉల్లిపాయలలోకి శ్రేష్టమైనవి. ఉల్లిపాయలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను క్రమబద్దీకరిస్తాయి.

Sunday, April 10, 2011

ఆడ, మగ వారి మెదళ్ళలో తేడాలు

మెదడు అన్ని అవయవాల పనితీరుని నిర్దేశిస్తుందని తెలుసు కదా! అయితే కొన్ని విషయాలలో ఆడవారు స్పందించే విధానానికి, మగవారు స్పందించే విధానానికి తేడా ఉంటుంది. దీనికి కారణం వారి మెదడులో జరిగే మార్పులే.

Saturday, April 9, 2011

బలమైన గుండెకు పదునైన చిట్కాలు

గుండె అవయవాలు అన్నింటిలో ముఖ్యమైనదని తెలుసు కదా! శరీర భాగాలన్నింటికీ గుండె రక్తం సరఫరా చేస్తుంది. కనుక దాని ఆరోగ్యం పైనే మిగిలిన అవయవాల ఆరోగ్యం ఆధారపడిఉంది. 

Friday, April 8, 2011

మీరెప్పుడైనా కూరగాయల మ్యూజియం గురించి విన్నారా

మీరెప్పుడైనా కూరగాయల  మ్యూజియం గురించి విన్నారా? బంగాళదుంపల సైనికులను, కూరగాయల మొనాలిసాను ఎప్పుడైనా చూశారా?   చైనాకు  చెందిన జు ద్యుయోకి కూరగాయలతో రకరకాల పెయింటింగులు తయారుచేయగలదు.  

Wednesday, April 6, 2011

అద్భుతంగా పని చేసే వింత చిట్కాలు

కొన్ని చిట్కాలు వింటుంటే వింతగా ఉన్నాయనిపిస్తుంది. కానీ అవి ఫలితాన్నిచ్చినప్పుడు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతాయి.   ఈ క్రింద చెప్పబడిన చిట్కాలు వింతగా ఉన్నప్పటికీ చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మీరే ప్రయత్నించి చూడండి.

Tuesday, April 5, 2011

మల్లె పూలతో టీ - ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఇది మల్లె పూల సీజన్ కదా! కనుక మల్లెపూలతో టీ ఎలా చేయాలో, దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.

Sunday, April 3, 2011

ఉగాది నాడు చేయవలసిన తొమ్మిది పనులు

ఉగాది ఎందుకు జరుపుకుంటారో, దాని ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మన పెద్దలు ఉగాదినాడు విధిగా చేయవలసిన కొన్ని పనులను నిర్దేశించారు. అవి:

Friday, April 1, 2011

జి మెయిల్ మోషన్: మీ కదలికలతో జి మెయిల్ కంట్రోల్ చేయండి

గూగుల్ క్రొత్త ఫీచర్  జి-మెయిల్ మోషన్. దీని ద్వారా మీరు మీ కదలికలతో జి-మెయిల్ కంట్రోల్ చేయవచ్చు. 

Thursday, March 31, 2011

మీరు పుస్తకాలను తినగలరా

మీరు పుస్తకాలను తినగలరా? పుస్తకాలను తినటం ఏమిటి, చదువుతారు కానీ అని అనుకుంటున్నారా? అయితే మీరు ఎడిబుల్ బుక్ ఫెస్టివల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. 

Tuesday, March 29, 2011

ఆడ, మగ వాళ్ళలో ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు

మీరెప్పుడైనా "ఎవరెక్కువ అబద్ధాలు చెప్తారు? ఆడవారా లేక మగవారా?" అని ఆలోచించారా? తమ సగటు అరవై ఏళ్ల జీవితంలో మగవారు కనీసం లక్షసార్లు, ఆడవారు యాభైవేలసార్లు అబద్ధాలు ఆడతారు. 

Monday, March 28, 2011

గర్భిణీ స్త్రీల యొక్క ఐరన్ లోపం పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది

గర్భిణీ స్త్రీలు వారి మొదటి మూడు నెలలలో ఐరన్ లోపాన్ని కలిగి ఉంటే వారి బిడ్డల మెదడు ఎదుగుదల సరిగా ఉండదు.  ఈ ఐరన్ లోపం రక్తహీనతను కలిగించేటంత ఎక్కువగా ఉండక పోయినా కూడా ఇది వారికి పుట్టే బిడ్డల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది.

చక్కెర వ్యాధిగ్రస్తులకు తీపివార్త

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28.5 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 5 కోట్లమంది భారతీయులే.

కావలసిన వస్తువులను 75 % దాకా తగ్గింపులో పొందండి

మీకు కావలసిన ఏ వస్తువైనా 75 % దాకా తగ్గింపులో పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? 

Saturday, March 26, 2011

ఎర్త్ అవర్ గుర్తుందా

ఎర్త్ అవర్ గుర్తుందా? అది ఈ రోజే. రాత్రి పూట 8.30 నుండి 9.30 వరకు. ఎర్త్ అవర్ మొదటిసారిగా 2007 లో సిడ్నీలో జరిగింది. 22 లక్షలమంది సిడ్నీ ప్రజలు అనవసరమైన లైట్లు అన్నింటిని ఆపివేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని 2008  వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎర్త్ అవర్ ఉద్యమంలో పాల్గొన్నాయి.

Friday, March 25, 2011

వింత పెన్నులు

పెన్నులు రాయడానికి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని వింత పెన్నులు వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.

Wednesday, March 23, 2011

ఆనందానికి అయిదు ఆహార పదార్ధాలు


మనం తీసుకొనే ఆహారం మన మూడ్ ని మార్చగలదని ఎన్నో పరిశోధనలలో రుజువైంది. కొన్ని ఆహార పదార్ధాలు మన ఆనందాన్ని పెంచుతాయి. ఈసారి మీ మూడ్ బాగాలేనప్పుడు క్రింద చెప్పిన ఆహార పదార్ధాలు తీసుకొని చూడండి.

ఈ అయిదు ఆహార పదార్ధాలు మీ ఆనందాన్ని పెంచుతాయి.

పదోతరగతి పిల్లలకు చిట్కాలు

రేపటినుండి  పదోతరగతి పిల్లలకు పరీక్షలు.   పిల్లలకు పరీక్షలంటే తల్లితండ్రులకు పరీక్షలే.ఎక్కువ వత్తిడి లేకుండా పిల్లలకు మంచి మార్కులు రావాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అవేంటంటే  

Tuesday, March 22, 2011

ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా

ఎర్త్ అవర్ గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం మార్చ్ ఆఖరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణంలో జరిగే మార్పుల పట్ల ప్రజలలో అవగాహన కలిగించడమే.  ఈ నెల అంటే మార్చ్ 26వ తారీఖు రాత్రిపూట 8.30 నుండి 9.30 వరకు ఎర్త్ అవర్ జరుగుతుంది.

Thursday, March 17, 2011

ఈ హోలీకి ఆర్గానిక్ రంగులు వాడండి

హోలీ వస్తోంది కదా! రంగులతో జాగ్రత్త. ఆర్గానిక్ రంగులు వాడండి. ఆర్గానిక్ రంగులంటే సహజంగా పసుపు, హెన్నా, బీట్రూట్, బంతిపువ్వు వంటివాటితో తయారయినవి. ఇవి చర్మానికి కానీ, కళ్ళకు కానీ ఎలాంటి హాని చేయవు.